లోయలో పడిన స్కూల్ బస్సు.. 27 మంది మృతి

  • 9 ఏప్రిల్ 2018
లోయలో పడిన బస్సు Image copyright Gian Thakur

హిమాచల్ ప్రదేశ్‌లో 60 మందితో వెళ్తున్న ఓ పాఠశాల బస్సు లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో 27 మంది చనిపోయారు. వీరిలో 23 మంది విద్యార్థులున్నారని అధికారులు వివరించారు.

సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

నుర్‌పూర్ నియోజకవర్గం సమీపంలోని మల్క్వాల్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

Image copyright Gurpreet chawla
చిత్రం శీర్షిక ఆస్పత్రి వద్ద చికిత్స పొందతున్న తమ పిల్లల కోసం ఎదురు చూపులు

ఈ లోయ 100 మీటర్లకుపైగా లోతు ఉండటంతో.. రోడ్డు పై నుంచి బస్సు కనిపించడం లేదు.

ఈ బస్సు ఓ ప్రైవేటు స్కూలుకు చెందింది. ఈ బస్సులో ఎక్కువ మంది పదేళ్లలోపు చిన్నారులే ఉన్నట్లు సమాచారం.

16 మంది చిన్నారులు గాయపడగా వారిని సమీపంలోని పఠాన్ కోట్ ఆస్పత్రికి తరలించారు.

మృతుల్లో డ్రైవర్, పాఠశాల సిబ్బంది కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు