చుక్..చుక్.. రైలు.. ఇంజిన్ లేదు
చుక్..చుక్.. రైలు.. ఇంజిన్ లేదు
వెయ్యి మందితో ప్రయాణిస్తున్న ఒక రైలు ఇంజిన్ లేకుండానే 15 కిలోమీటర్లు పట్టాలపై వెళ్లింది. భారత్‌లోని ఒడిశాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
శనివారం రాత్రి ఇంజిన్ నుంచి బోగీలను వేరు చేయగానే రైలు ముందుకు వెళ్లిపోయింది.
అరగంట తర్వాత సిబ్బంది పెద్ద పెద్ద బండరాళ్లను అడ్డుపెట్టి చివరకు రైలును నిలిపివేశారు.
రైల్లోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)