కామన్‌వెల్త్ క్రీడల్లో మరో స్వర్ణం.. షూటింగ్‌లో సత్తా చాటిన హీనా సిధూ

  • 10 ఏప్రిల్ 2018
హీనా సిద్ధూ Image copyright Getty Images

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హీనా సిద్ధూ స్వర్ణ పతకం గెలిచింది.

ఆమె మొత్తం 38 పాయింట్లు సాధించగా.. ఆస్ట్రేలియాకు చెందిన ఎలెన గలిబొవిచ్ 35 పాయింట్లతో రజతం, మలేషియాకు చెందిన ఆలియా సజానా అజహరి 26 పాయింట్లతో కాంస్యం సాధించారు.

రెండు రోజుల కిందట జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హీనా సిద్ధూ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

2016లో క్రీడల్లో పాల్గొనడానికి ఇరాన్ వెళ్లిన హీనా సిద్ధూ హిజాబ్ ధరించి క్రీడల్లో పాల్గొనాలన్న నిబంధనను వ్యతిరేకించిన ఘటనతో వార్తల్లోకెక్కింది.

అంతేకాదు, ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్న మొదటి భారతీయ మహిళా పిస్టల్ షూటర్ కూడా ఆమే.

హీనా కేవలం ఓ క్రీడాకారిణి మాత్రమే అనుకుంటే పొరబాటే. ఆమె ఓ డెంటల్ సర్జన్, పెయింటర్ కూడా!

Image copyright facebook
చిత్రం శీర్షిక హీనాకు రౌనక్ పండిట్ శిక్షణ ఇచ్చేవాడు. అలా..అలా.. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)