శతాబ్దాల చరిత్ర ఉన్న సురభి నాటకం

శతాబ్దాల చరిత్ర ఉన్న సురభి నాటకం

సురభి నాటకాల గురించి తెలుగువారికి కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు.

133 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నాటక సమాజం అందరికీ సుపరిచతమే.

నాటకమే జీవితం.. నాటకమే సర్వస్వం అన్నట్టుగా సురభి కుటుంబం ఈ కళను బతికిస్తూ వస్తోంది.

తమ పూర్వీకులు అందించిన ఈ కళా రూపాన్ని కొనసాగించేందుకు ఇంటిల్లిపాది కష్టపడుతున్నారు.

మరి ఏడెనిమిది తరాలుగా కొనసాగుతున్న ఈ నాటకాలపై సురభి కుటుంబంలోని యువత మనోగతం ఏమిటి? ఈ కళను కొనసాగించాలన్న ఆసక్తి వారిలో ఉందా?

ఈ విషయాలు తెలుసుకునేందుకు బీబీసీ సురభి వారితో మాట్లాడింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)