నేనే నంబర్ 1

  • 12 ఏప్రిల్ 2018
శ్రీకాంత్ Image copyright Getty Images

కామన్వెల్త్ క్రీడలపోటీల్లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం విభాగంలో భారత్ స్వర్ణ పతకం గెలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్, గురువారంనాడు విడుదలైన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడ్ల్యుఎఫ్) ర్యాంకింగ్స్‌లో అధికారికంగా ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని అందుకున్నాడు.

‘ఇది శ్రీకాంత్‌తో పాటు భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తుకు కూడా మంచి పరిణామం’ అని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.

Image copyright Getty Images

డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌‌ను వెనక్కునెట్టి 76,895 పాయింట్లతో శ్రీకాంత్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు శ్రీకాంతే.

భారత్‌కు చెందిన హెచ్‌ఎస్. ప్రణయ్ 11వ స్థానంలో సాయి ప్రణీత్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు.

2017లో శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచి, ఆ గుర్తింపును సాధించిన తొలి భారతీయుడిగానూ నిలిచాడు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు