రాజస్థాన్ పష్తోలు: మేం ముస్లింలం కాదు.. హిందువులం, భారతీయులం!

  • 16 ఏప్రిల్ 2018
పష్తో వర్గానికి చెందిన మహిళ

పాకిస్తాన్‌ నుంచి 70 ఏళ్ల కిందట పష్తూన్ వర్గం వాళ్లు భారత్‌కు వలస వచ్చారు. వీళ్లలో ఎక్కువ మంది రాజస్థాన్‌లోనే స్థిరపడ్డారు. ఇన్నేళ్ల నుంచి భారత్‌లోనే ఉంటున్నా వీళ్లకు సరైన గుర్తింపు లేదు.

స్థానికులతో కలిసిపోవడానికి తమ సంస్కృతీ సంప్రదాయాలను వదిలిపెట్టాల్సి వచ్చిందని వీళ్లు బాధపడతారు. తమ వేషధారణ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయనీ, దాంతో తమను ముస్లింలుగా భావించి స్థానికులు తమతో కలవడానికి ఇష్టపడరనీ వీళ్లు చెబుతారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionహిందూ పష్తోలు

పిల్లలతో పష్తో భాషలో మాట్లాడటానికి కూడా వీళ్లు ఇష్టపడట్లేదు. తమ భాషలో మాట్లాడితే నవ్వుతున్నారనీ, హేళన చేస్తున్నారనీ అంటున్నారు.

తమ ఆచారం ప్రకారం వీళ్లు ముఖంపై పచ్చబొట్లు వేయించుకుంటారు. దీన్ని షీన్‌ఖలై అని పిలుస్తారు. ఆ పచ్చబొట్ల వల్ల వీళ్లు ఇతరులకంటే భిన్నంగా కనిపిస్తున్నారు.

ఎన్ని సమస్యలొచ్చినా కొందరు పష్తోలు మాత్రం తమ సంస్కృతీ సంప్రదాయాలను భద్రంగా కాపాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)