#BBCNewsPopUp: కన్నడ కుర్రకారు ఏం కోరుకుంటున్నారు?

  • 13 ఏప్రిల్ 2018
కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కనిపిస్తున్న హడావుడి

కర్ణాటకలో ఎన్నికల భేరీ మోగడంతో ఎటుచూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఏ నోట విన్నా ఒకటే చర్చ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా? లేదా?

అధికారాన్ని నిలుపుకొంటుందా? లేదా?.. ఎవరు గెలుస్తారు? ఇవే చర్చలు.

మే 12న పోలింగ్ జరుగుతుంది. 15న ఫలితాలను ప్రకటిస్తారు. దాంతో ప్రచారం ఇప్పటికే పెద్ద ఎత్తున సాగుతోంది.

ఈ క్రమంలోనే BBC News Pop Up బృందం కర్ణాటకలో అడుగుపెట్టింది. స్థానికులతో మాట్లాడుతూ వారు బీబీసీ నుంచి ఎలాంటి కథనాలు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటోంది.

చిత్రం శీర్షిక కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కనిపిస్తున్న హడావుడి

సాధారణంగా ఎన్నికల కవరేజి కోసం మీడియా సంస్థలు ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ నిర్ణయించుకుంటాయి. కానీ, బీబీసీ మాత్రం పాఠకులనే నిర్ణయించమని కోరుతోంది. మీకేం కావాలో చెప్పమంటోంది.

మరీ ముఖ్యంగా కర్ణాటక యువత అభిప్రాయాలను మేం వినాలనుకుంటున్నాం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకన్నడనాట ఎన్నికల సందడి

ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్నప్పటికీ బెంగళూరులో సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి. నీటి కొరత, పారిశుద్ధ్య సమస్య, విపరీతమైన రద్దీ, కాలుష్యం, గతుకుల రోడ్లు వంటి ఎన్నో సమస్యల కారణంగా బెంగళూరు నిత్యం వార్తల్లో ఉంటుంది.

సుమారు 1.1 కోట్ల జనాభా ఉన్న ఈ నగరం నిత్యం సమస్యలతో సతమతమవుతోంది.

ఇవన్నీ చాలవన్నట్లుగా అస్తిత్వ రాజకీయాలు, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలు, శాంతిభద్రతల సమస్యలు, అవినీతి, వ్యవసాయ సంక్షోభాలు వంటివన్నీ ఎన్నికల అంశాలే.

ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కానీ, ఏం చేస్తే వారు తమవైపు ఆకర్షితులవుతారన్నది మాత్రం అంచనా వేయలేకపోతున్నాయి.

ఇంతకీ... కర్ణాటక యువత మదిలో ఏముంది?

చిత్రం శీర్షిక #BBCNewsPopUp #KarnatakaElections2018 హ్యాష్‌ట్యాగ్‌తో బీబీసీ తెలుగు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ పేజీల ద్వారా మాకు మీ ఆలోచనలు పంపించండి.

ఇంకెందుకాలస్యం..? ఈ రోజు(ఏప్రిల్ 13) బెంగళూరులోని ఇందిరానగర్‌లోని హమ్మింగ్ ట్రీ బార్‌లో సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య నిర్వహించే మా టౌన్‌హాల్ ఈవెంట్‌లో పాల్గొని మీ మనసు విప్పండి. ఏఏ అంశాలపై, ఎలాంటి కథనాలు కోరుకుంటున్నారో చెప్పండి.

ఇదే మంచి సమయం.. మీరిచ్చిన కథనాలోచనలను బీబీసీ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.

మీరు ఈ ఈవెంట్‌కు రాలేకపోతే #BBCNewsPopUp #KarnatakaElections2018 హ్యాష్‌ట్యాగ్‌తో బీబీసీ తెలుగు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ పేజీల ద్వారా మాకు మీ ఆలోచనలు పంపించండి. అప్‌డేట్స్ కోసం ఈ పేజీలను ఫాలోకండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.