కన్నడనాట ఎన్నికల సందడి

కన్నడనాట ఎన్నికల సందడి

కర్నాటకలో ఎన్నికల భేరీ మోగడంతో ఎటుచూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఏ నోట విన్నా ఒకటే చర్చ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా? లేదా?

అధికారాన్ని నిలుపుకొంటుందా? లేదా?.. ఎవరు గెలుస్తారు? ఇవే చర్చలు.

మే 12, 15 తేదీల్లో రెండు షెడ్యూళ్లలో ఎన్నికలు జరగనుండడంతో ప్రచారం ఇప్పటికే పెద్ద ఎత్తున సాగుతోంది.

ఈ క్రమంలోనే BBC News Pop Up బృందం కర్నాటకలో అడుగుపెట్టింది. స్థానికులతో మాట్లాడుతూ వారు బీబీసీ నుంచి ఎలాంటి కథనాలు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటోంది.