ఉత్తమ ప్రజాకర్షక చిత్రం బాహుబలి 2.. తెలుగు చిత్రం ఘాజీ

65వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ అధ్యక్షుడు శేఖర్ కపూర్ శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు.
ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ నిలిచింది. దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి పొట్లూరి దీనిని నిర్మించారు. 1971లో పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య విశాఖపట్నం సమీపంలో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. పీఎన్ఎస్ ఘాజీ అనే పేరుగల పాకిస్తానీ జలాంతర్గామితో భారతదేశ నావికాదళ సైనికులు ఎలా పోరాడారన్నదే ఈ చిత్ర కథాంశం.
65వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా.. సంక్షిప్తంగా..
ఉత్తమ నటి: శ్రీదేవి (మామ్)
ఉత్తమ నటుడు: రిద్ధి సేన్ (నగర్‌కీర్తన్)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫజిల్ (తొడిముథలం ద్రిక్షక్షియుమ్)
ఉత్తమ సహాయ నటి: దివ్యదత్త (ఇరద)
ఉత్తమ దర్శకుడు: జయరాజ్ (భయానకం)
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: విలేజ్ రాక్‌స్టార్స్
ఉత్తమ ప్రజాకర్షక చిత్రం సమగ్ర వినోదం: బాహుబలి 2
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: బాహుబలి 2
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: అబ్బాస్ అలీ మొఘుల్ (బాహుబలి 2)
ఉత్తమ సంగీతం (పాటలు): ఏఆర్ రెహమాన్ (కాట్రు వెలియిదై)
ఉత్తమ నేపథ్య సంగీతం: ఏఆర్ రెహమాన్ (హిందీ చిత్రం: మామ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కేజే ఏసుదాస్
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్
ఈ కథనం అప్డేట్ అవుతోంది..
ఇవి కూడా చదవండి:
- సినిమా అమ్మ.. ఇకపై కాదు కన్నీటి బొమ్మ
- సినిమాహాళ్లలో జాతీయగీతం ఎందుకంటున్న సినీ ప్రేమికులు
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- సినిమావాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)