కఠువా-ఉన్నావ్: ఆ రేప్ కేసులపై ప్రధాని మోదీ ఏమన్నారు?

  • 13 ఏప్రిల్ 2018
నరేంద్ర మోదీ Image copyright Twitter/@PIB_India

ఉన్నావ్, కఠువాలలో జరిగిన రేప్ ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడారు. ఈ రెండు ఘటనలూ అవమానకరమైనవని అంటూ, దోషులకు కఠిన శిక్షలు పడేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని ఆయన అన్నారు.

అయితే, ఈ రెండు కేసులకు సంబంధించి బీజేపీ పాత్రపై తలెత్తుతున్న ప్రశ్నలకు ఆయన ఏ వివరణా ఇవ్వలేదు.

రాజ్యాంగ నిర్మాత భీమ్‌రావ్ అంబేడ్కర్ జయంతికి ముందురోజు, శుక్రవారం దిల్లీలో జరిగిన డాక్టర్ అంబేడ్కర్ నేషనల్ మెమోరియంలో ప్రధాని ప్రసంగించారు.

కఠువా-ఉన్నావ్‌లపై ప్రధాని ఏమన్నారు?

Image copyright FACEBOOK/IKULDEEPSENGAR
  • గత రెండు రోజులుగా వార్తల్లో నలుగుతున్న ఘటనలు సభ్య సమాజంలో వాంఛనీయం కాదు. ఇవి చాలా అవమానకరమైనవి. ఒక సమాజంగా, ఒక దేశంగా మనమంతా దీనికి సిగ్గు పడుతున్నాం.
  • దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఏ దారుణం జరిగినా మనలోని మానవీయ సంవేదనలను కుదిపివేస్తాయి. అయితే, నేరస్థులెవరూ తప్పించుకోలేరు, న్యాయం జరుగుతుంది, పూర్తిగా జరుగుతుందని నేను దేశప్రజలకు హామీ ఇస్తున్నా. మన బిడ్డలకు తప్పక న్యాయం జరుగుతుంది.
  • మన సమాజంలో పేరుకున్న ఈ చెడులను నిర్మూలించడానికి మనమంతా కలిసి పని చేయాలి.
  • 2014లో నేను ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి ప్రసంగించింది ఎర్రకోట నుంచి అన్నది మీకు తెలిసిందే. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన ఆడపిల్లలను కాదు, మగపిల్లలను ఎటు వెళ్లారని అడగండని నేనా ప్రసంగంలో తల్లిదండ్రులకు చెప్పాను.
  • దోషులకు కఠినమైన శిక్ష పడేలా చేయడం మనందరి బాధ్యత. భారత ప్రభుత్వం ఈ బాధ్యతను నిర్వర్తించడానికి ఏ మాత్రం వెనుకాడదు. దేశప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)