వీడియో: కఠువా రేప్ కేసులో సీబీఐ ఇప్పుడొచ్చి ఏం చేస్తుంది?

కఠువా రేప్ కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు విచారణ జమ్మూకశ్మీర్ బయట జరగాలని అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

‘ఆ బాలికతో పాటు అందరికీ న్యాయం జరగాలి. జమ్మూకశ్మీర్‌లో పారదర్శకంగా విచారణ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. నిందితులకు అక్కడ లభిస్తున్న మద్దతును చూస్తుంటే, కేసు విచారణ సజావుగా సాగుతుందనే నమ్మకం నాకు కలగట్లేదు’ అని బాధిత కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా రజావత్ బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు.

కఠువా రేప్ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు.

ఏప్రిల్ 9న క్రైం బ్రాంచి అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కఠువా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లినప్పుడు కొందరు న్యాయవాదులు గొడవకు దిగి అడ్డుకున్నారు.

అందుకే దీపిక ఈ కేసు విచారణ రాష్ట్రానికి వెలుపల జరగాలని కోరుతున్నారు.

‘ఆ బాలికతో పాటు అందరికీ న్యాయం జరగాలి. జమ్మూ కశ్మీర్‌లో పారదర్శకంగా విచారణ జరుగుతుందని నేను అనుకోవట్లేదు.

నిందితులకు అక్కడ లభిస్తున్న మద్దతును చూస్తుంటే, కేసు విచారణ సజావుగా సాగుతుందనే నమ్మకం నాకు కలగట్లేదు’ అని బాధిత కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా రజావత్ బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు.

వీడియో: మోహిత్ కాంధారి

ఇవి కూడా చూడండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.