లబ్ డబ్బు: జాబు వస్తుందా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ఈ మధ్య కాలంలో నిరుద్యోగం పై చర్చ.. రచ్చ మధ్యలో పకోడీలకు గొప్ప గిరాకీతో పాటు అద్భుతమైన పేరు కూడా వచ్చేసింది. భారత్లో తగ్గిపోతున్న ఉద్యోగావకాశాలు అనే అంశం ఈ మధ్య హాట్ టాపిక్ గా మారింది. అసలు భారత్ లో ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.. అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వారం లబ్ డబ్బులో చూద్దాం.
భారత్ యువరక్తంతో ఉరకలెత్తుతోంది. దేశంలో యువతీయువకుల సంఖ్య భారీగానే ఉంది. మరందుకే ఉద్యోగావకాశాలు కూడా అంతే రేంజ్ లో ఉండాలి. కానీ లేవు. అదే అసలు సమస్య.
ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళ సంఖ్య, ఉద్యోగాల సంఖ్య బ్యాలన్స్ అవ్వట్లేదు. పైగా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఆటోమేషన్ పేరుతో అన్ని పనులు యంత్రాలే చేసేస్తుంటే నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతోంది.
ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE
అనేక రంగాల్లో ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది కానీ అదే సమయంలో చాలా రంగాల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయి.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ దేశాలు, దక్షిణాసియాతో పోల్చి చుస్తే భారత్ లో నిరుద్యోగ సమస్య ఎక్కువ.
2017 నుంచి 2019 మధ్య కాలంలో ఈ సమస్య 3.4-3.5%గా ఉంది.
15 నుంచి 24 ఏళ్ల వయస్సు వారిలో నిరుద్యోగం అత్యధికంగా ఉంది.
ఐఎల్వో లెక్కల ప్రకారం 2017లో భారత్లో నిరుద్యోగుల సంఖ్య దాదాపు కోటి ఎనభై మూడు లక్షలు.
2018 లో ఈ సంఖ్య కోటి ఎనభై ఆరు లక్షలకు పెరిగే అవకాశముంది.
2019 కల్లా ఈ సంఖ్య కోటి ఎనభై తొమ్మిది లక్షలకు చేరే అవకాశముంది.
బాధాకరమైన విషయమేంటంటే చాలా మంది వేరేదారిలేక అసంఘటిత రంగంలో ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రతి పది మందిలో ఏడుగురు ఇలా అసంఘటిత రంగంలో పని చేసుకుంటున్నారు.
వీరికి ఎటువంటి సామజిక భద్రత లేదు. అంతేకాదు చాలా మంది ఎటువంటి లిఖితపూర్వక కాంట్రాక్టులు లేకుండా పని చేస్తున్నారు.
మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.