కఠువా అత్యాచారం: ‘దేశంలో అసలు మానవత్వం ఉందా?’

  • 15 ఏప్రిల్ 2018
బాలిక మృతదేహం లభ్యమైన ప్రదేశం
చిత్రం శీర్షిక వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత బాలికను చంపేసి శరీరాన్ని అడవిలో ఇక్కడ పడేశారు

జమ్ముకశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను కలచి వేసింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశ భక్తి, జాతీయవాదంపై చర్చ జరుగుతోంది.

కొందరు జాతి వ్యతిరేకులను గుర్తించాలని కోరుతుండగా.. మరికొందరు ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు.

మొత్తానికి చాలా మంది చిన్నారులు, మహిళల భద్రత గురించి మాట్లాడారు.

దేశంలో మానవత్వం క్రమంగా కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి అయిదు భాషలకు చెందిన ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులను మేం ఓసారి పరిశీలించాం.

ఈ పోస్టుల్లో భారతీయులు తాజా కశ్మీర్ ఘటనపై ఎలా స్పందించారో చూడండి.

Image copyright facebook

తెలుగు

ఫేస్‌బుక్‌లో జహా ఆరా అనే యూజర్.. గతంలో జరిగిన పలు ఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఆదివాసీలపై ఇంకా దాడులు జరుగతూనే ఉన్నాయంటూ పైపోస్టును పెట్టారు.

Image copyright facebook

తెలుగు వెంకటేశ్ అనే యూజర్.. ‘తల్లులారా మీ పిల్లలను ఎలా కాపాడుకుంటారు? తండ్రులారా మీ కంటి పాపలకు ఎలా కాపలా కాస్తారు?’ అని ప్రశ్నించారు.

‘క్షమించు తల్లీ’ అంటూ తాజా ఘటనపై సామాన్యుని నిస్సహాయతను వ్యక్తం చేశారు.

పంజాబీ

పంజాబీ నటి నీరూ బజ్వా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్రంగా స్పందించారు.

‘ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మన నేతలు చూస్తున్నారా? వింటున్నారా?’ అని ప్రశ్నించారు.

ఇక నటి గుల్పనాగ్ కూడా.. ‘నేను హిందుస్థానీ. నేను చాలా సిగ్గుపడ్డా..’ అంటూ పై ట్వీట్ చేశారు.

మరాఠీ

Vikhya @vikhya21 అనే యూజర్ ట్విటర్లో కఠువా అత్యాచార ఘటనలో ప్రజలు హిందూ మతం పేరును చెడగొడుతున్నారని పేర్కొన్నారు.

‘హిందూ మతం ఎప్పుడూ అత్యాచారాలను పోత్సహించలేదు’ అని ట్వీట్ చేశారు.

Devendra @DevTheD అనే యూజర్.. ‘కఠువా, ఉన్నావ్ రేప్ ఘటనలు మానవత్వానికి వ్యతిరేకం. ఈ ఘటనలకు పాల్పడిన వారిని వీలైనంత త్వరగా శిక్షించాలి..’ అని పేర్కొన్నారు.

గుజరాతీ

బాప్‌లాల్ అనే యూజర్.. ‘నిర్భయ ఘటనపుడు కొందరు మా రాష్ర్టంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. మరి ఇప్పుడు ఎవరైనా అలాంటి ప్రదర్శన చేయగలరా?’ అని కోరారు.

వినయ్ ప్రజాపతి అనే హ్యాండిల్.. ‘అంబేడ్కర్ మన రాజ్యాంగ నిర్మాత. కఠువా, ఉన్నావ్ కేసుల్లో దోషులకు కఠిన శిక్షపడాలి. అప్పుడే అంబేడ్కర్ కు నిజమైన నివాళి’ అన్నారు.

తమిళం

అరదు అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో.. ‘‘చరిత్ర చూస్తే.. యుద్ధం, హింస వంటి ఘటనల్లో మొదట బలయ్యేది మహిళలే. అయితే అనాగరిక సమాజంలోనూ వారు బాలికలను రేప్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం సాంకేతిక యుగంలో ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మతం అనేదానిని మానవ అభివృద్ధి కోసం ప్రవేశపెడితే.. దాన్ని ద్వేషాన్ని ప్రచారం చేయడం కోసం మాత్రమే వినియోగిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటి

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?

‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’

సాయంత్రం 6 లోగా బలపరీక్ష జరపండి.. డెడ్‌లైన్ పొడిగించిన గవర్నర్

జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్‌లో రాజకీయ జోక్యంతో జట్టుపై నిషేధం

ప్రెస్ రివ్యూ: ‘రోడ్డు మీద పడుకుంటా’.. ‘40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదేనా’

కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను పాకిస్తాన్ ఎలా సమీక్షిస్తుంది

హత్యకేసులో జీవిత ఖైదు పడిన శరవణ భవన్ యజమాని గుండెపోటుతో మృతి