కామన్‌వెల్త్ క్రీడలు: బ్యాడ్మింటన్‌లో చేజారిన స్వర్ణం.. రజతంతో సరిపెట్టుకున్న శ్రీకాంత్

  • 15 ఏప్రిల్ 2018
శ్రీకాంత్, ఛాంగ్ Image copyright Getty Images

ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియా క్రీడాకారుడు ఛాంగ్ వెల్ లీ 2-1 తేడాతో కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు.

మొదటి సెట్‌‌ను శ్రీకాంత్ 21-19 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.

అయితే, ఆ తర్వాత ఛాంగ్ లీ హోరా హోరీగా పోరాడి శ్రీకాంత్‌ను వెనక్కు నెట్టాడు. రెండో సెట్‌ 21-14తో నెగ్గిన మలేషియా క్రీడాకారుడు మూడో సెట్‌ను కూడా 21-14 తేడాతోనే కైవసం చేసుకున్నాడు.

మూడు సెట్ల ఈ మ్యాచ్‌ను 2-1 పాయింట్ల తేడాతో గెలుపొంది.. స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఛాంగ్‌లీ.

శ్రీకాంత్‌కు రజత పతకం లభించింది.

కామన్‌వెల్త్ క్రీడలపై మరిన్ని కథనాలు:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.