అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడితే ప్రేమలో పడతారా?

  • 19 ఏప్రిల్ 2018
అమ్మాయిలు Image copyright Getty Images

‘అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడితే అబ్బాయిలతో ప్రేమలో పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లకు ఫోన్లను కొనివ్వకండి. అప్పుడే ఇతర విషయాలను వదిలేసి చదువుపై దృష్టిపెడతారు’.. ఇవీ హరియాణాలోని ఇషాపుర్ ఖేరీ గ్రామ పెద్దలు విధించిన ఆంక్షలు.

తమ గ్రామం నుంచి సోనీపట్, గొహనా నగరాలకు పైచదువుల కోసం వెళ్లే దాదాపు 100 మంది అమ్మాయిలపై వాళ్లు ఈ ఆంక్షల్ని విధించారు.

‘రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు పుడతాయి. అందుకే మా జాగ్రత్తలో మేమున్నాం. స్మార్ట్ ఫోన్లపై నిషేధం విధించడం ద్వారా వాళ్ల దృష్టి చదువుపైనే పెట్టేలా చేయగలం’ అని ఇషాపుర్ సర్పంచ్ ప్రేమ్ సింగ్ అన్నారు.

‘స్మార్ట్ ఫోన్ ఉంటే రోజంతా అబ్బాయిలతో చాటింగ్ చేస్తారు. ఆ విషయం వాళ్ల తల్లిదండ్రులకు తెలీదు. అదే స్మార్ట్ ఫోన్ లేకపోతే, అసలు ఎలాంటి సమస్యలూ ఉండవు. మంచి అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్‌తో అవసరం ఉండదు. అలాంటి అమ్మాయిల జోలికి ఎవరూ రారు’ అంటూ ప్రేమ్ సింగ్ తమ ఆంక్షల్ని సమర్థించుకున్నారు.

తమ గ్రామానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు పైచదువులకు వేరే నగరాలకు వెళ్లారనీ, ఆ తరవాత తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారనీ ప్రేమ్ సింగ్ చెప్పారు. ఆ అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చారనీ, మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ వివరించారు.

ఫోన్ సాయంతోనే అబ్బాయిలతో టచ్‌లో ఉంటూ అమ్మాయిలు ఇల్లొదిలి వెళ్లిపోతున్నారనీ, ఫోన్ లేకపోతే వాళ్లలా చేయరనీ ఆయన తమ చర్యను సమర్థించుకున్నారు.

మరోపక్క స్మార్ట్ ఫోన్లు చదువుకు ఎంతగానో ఉపయోగపడతాయనీ, మహిళల భద్రతకు కూడా అవి సాయపడతాయనే విషయాన్ని వాళ్లు ఒప్పుకోవట్లేదు.

ఈ విషయంపై జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నివేదితా మీనన్ మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే అమ్మాయిలకు ఓ గదిలో కూర్చొనే ప్రపంచాన్ని చుట్టేసే స్వేచ్ఛ లభిస్తుందని వ్యాఖ్యానించారు. ఆమె గతంలో ‘ఫైటింగ్ పాట్రియార్కీ అండ్ క్యాపిటలిజం’ అనే పుస్తకం రాశారు.

‘అమ్మాయిలు నాలుగ్గోడలకే పరిమితమవ్వాలనే పితృస్వామ్య వ్యవస్థ భావజాలానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది. అమ్మాయిలు తమ కలల్ని సాకారం చేసుకోవడానికి ఇంటర్నెట్ ఉన్న ఫోన్లు సహాయపడతాయనే విషయాన్ని వాళ్లు మరచిపోతున్నారు.

మొబైల్ ఫోన్ స్వేచ్ఛకు సంకేతం. ఫోన్ వాడుతున్న అమ్మాయిలు స్వతంత్రంగా ఉండగలరని అర్థం చేసుకోవచ్చు. అదే పితృస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది’ అని నివేదిత అభిప్రాయపడ్డారు.

‘ఫోన్ వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధికి అది తోడ్పడుతుంది. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే చదువుకునే తమ కొడుకులు ఫోన్ అడిగితే వెంటనే కొనిస్తారు. కానీ అమ్మాయిలు అడిగితే మాత్రం రకరకాల ప్రశ్నలు వేస్తారు’ అని పంజాబ్ యూనివర్సిటీ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ రాజేష్ గిల్ అభిప్రాయపడ్డారు.

చిత్రం శీర్షిక జగ్మతీ సంగ్వాన్

అమ్మాయిలకు ఫోన్ నిషేధించడమంటే వాళ్లపై ఓ విధమైన వివక్ష చూపడమే అని ఆలిండియా డెమక్రటిక్ విమెన్స్ అసోసియేషన్(AIDWA) మాజీ కార్యదర్శి జగ్మతీ సంగ్వాన్ అన్నారు.

‘అమ్మాయిల స్వేచ్ఛ, హక్కులు, నిర్ణయాల లాంటి వాటన్నింటినీ అదిమేసే ప్రయత్నం ఇది. ఓ పక్క కామన్వెల్త్ క్రీడల్లో అమ్మాయిలు దేశాన్ని గర్వపడేలా చేస్తుంటే, మరోపక్క వాళ్లపై ఈ విధమైన ఆంక్షలు విధించడం దురదృష్టకరం’ అని ఆమె పేర్కొన్నారు.

ఆ నిర్ణయం తీసుకున్నవాళ్లంతా మగవాళ్లేననీ, వాళ్లు ఫోన్లు వాడుతూ మిగతా వాళ్లను నియంత్రించడం సరికాదనీ చెప్పారు.

‘అమ్మాయిల భద్రతకే కాదు, చదువుకు కూడా స్మార్ట్ ఫోన్ చాలా అవసరం. కానీ వాళ్లపై ఆంక్షలు విధించినవాళ్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదు’ అని రోహ్తక్‌కి చెందిన లా విద్యార్థి కిరణ్ ఈ ఆంక్షలపై తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

తేమ నిండిన ఎండలు ఎంత ప్రమాదకరం.. ఎవరికి ప్రాణాంతకం

WHO: ‘కరోనావైరస్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడొద్దు’.. క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత

‘నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా.. లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది’

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ: పాడైపోయిన ఆకు కూరలు, కూరగాయలు.. సాగు నష్టపోయిన 400 రైతు కుటుంబాలు

పింజ్రా తోడ్: ‘దేశ వ్యతిరేక కార్యకలాపాల’ ఆరోపణలతో యువతుల అరెస్ట్ - బెయిల్ - వెంటనే మళ్లీ అరెస్ట్

3 గంటల్లోనే 2.4 లక్షల తిరుప‌తి లడ్డూల విక్రయం

‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’

లాక్‌డౌన్ ‌సమయంలో టెక్ ఇండస్ట్రీ విజేతలు ఎవరు? పరాజితులు ఎవరు?

''ఆస్తుల విక్రయం ప్రతిపాదనను పున:పరిశీలించండి.. అప్పటివరకూ అమ్మకాలు ఆపేయండి'' - టీటీడీకి ఏపీ ప్రభుత్వం ఆదేశం