'బెంగళూరు బేకు': ఇది ప్రజల మేనిఫెస్టో!

  • 20 ఏప్రిల్ 2018
బెంగళూరు మహిళ

ఎప్పుడైనా ఎన్నికలు వచ్చాయంటే.. రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలతో మీ ఇంటి తలుపులు తడుతూ, ఓట్లు అడుతుంటారు. మరి ప్రజలే తమ సొంత మేనిఫెస్టో తయారు చేసి రాజకీయ నేతలకు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా?

ఇప్పుడు అత్యంత కీలకంగా మారిన కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరు వాసులు అలాగే చేస్తున్నారు.

అందరూ ఒకచోటుకి చేరి మేనిఫెస్టో రూపొందించారు. దాన్ని ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు అందజేశారు.

'సిటిజన్స్ ఫర్ బెంగళూరు' అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన పిలుపుతో నగరం నలుమూలల నుంచి ప్రజలు ఒక్కచోటికి చేరారు. రోజూ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇది ప్రజల మేనిఫెస్టో!

విస్తృత సమాలోచనల అనంతరం 'బెంగళూరు బేకు'(అంటే 'బెంగళూరుకి ఇది కావాలి') పేరుతో మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశారు.

ట్రాఫిక్ సమస్య, రోడ్లు, కాలుష్యం, చెత్త నిర్వహణ, పారిశుద్ధ్యం, పాదచారుల హక్కులు, నివాసం.. ఇలా మొత్తం 13 అంశాలను అందులో పొందుపరిచారు.

ఎన్నికలు దగ్గరపడగానే ఓట్లు అడుక్కునేందుకు రాజకీయ నాయకులు వస్తారు. అది చేశాం, ఇది చేశామని చెబుతారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో వాళ్లు చేసిందేమీ లేదు. ఎన్నికలకు ముందు కొన్ని నెలల ముందే కొన్ని పనులు చేస్తారు. దురదృష్టం కొద్ది అలాంటి నాయకులకే ఓట్లేసి గెలిపిస్తున్నాం' అని బెంగళూరు నివాసి డాక్టర్. అర్చన ప్రభాకర్ అన్నారు.

ప్రజా సమస్యలను రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజల్లో చైతన్యం పెంచాలన్నదే ఈ మేనిఫెస్టో ఉద్దేశం.

'ఇది నాయకుల కోసం ప్రజలు రూపొందించిన మేనిఫెస్టో' అని అర్చన తెలిపారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఒక్క రోజు సీఎం అయితే మీరేం చేస్తారు?

'పనులు చేయకుంటే ప్రజలు ఊరుకోరు అన్న విషయాన్ని నాయకులకు తెలియాలి. మన హక్కులను అడగడం మన హక్కు. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా మనం సహకరించాలి' అని ఆమె అంటున్నారు.

"ఓట్ల కోసం మా ఇంటికి వచ్చిన రాజకీయ నాయకులు మా మేనిఫెస్టో చూసి అవాక్కయ్యారు. తమ ప్రవర్తన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరన్న విషయాన్ని వారు గ్రహించారు" అని అర్చన బీబీసీతో చెప్పారు.

కొద్ది రోజుల కిందట అర్చన, ఆమె భర్తతో పాటు ఓ బృందం బెంగళూరులో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలకు వెళ్లి తమ మేనిఫెస్టోను అందించారు.

బీజేపీ సహా చాలా పార్టీలు దాన్ని స్వీకరించాయి.

మరి ఈ ప్రజల మేనిఫెస్టోలో పేర్కొన్న సమస్యలను ఎన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తాయో చూడాలి.

కర్ణాటక ఎన్నికల వేళ మీరు అక్కడి నుంచి ఎలాంటి కథనాలు కావాలని కోరుకుంటున్నారో మాకు చెప్పండి!

#BBCNewsPopUp , #KarnatakaElections2018 హ్యాష్‌ట్యాగ్‌లతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ బీబీసీ తెలుగుతో టచ్‌లో ఉండండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

రోహిత్ శర్మ IND vs. SA: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల

టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

ప్రెస్‌రివ్యూ: ‘బాలికల పాఠశాలల్లో పురుష టీచర్లపై నిషేధం‘

#100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...

భారతదేశంలో ఇంటర్నెట్‌ను అత్యధికంగా వాడుతున్నదెవరు...

బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ

శాన్ జోస్ యుద్ధ నౌక: సాగర గర్భంలోని నౌకలో లక్షల కోట్ల సంపద... దక్కేది ఎవరికి?