ఇది ప్రజల మేనిఫెస్టో!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇది ప్రజల మేనిఫెస్టో!

  • 20 ఏప్రిల్ 2018

ఎప్పుడైనా ఎన్నికలు వచ్చాయంటే.. రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలతో మీ ఇంటి తలుపులు తడుతూ, ఓట్లు అడుతుంటారు. మరి ప్రజలే తమ సొంత మేనిఫెస్టో తయారు చేసి రాజకీయ నేతలకు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా?

ఇప్పుడు అత్యంత కీలకంగా మారిన కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరు వాసులు అలాగే చేస్తున్నారు.

అందరూ ఒకచోటుకి చేరి మేనిఫెస్టో రూపొందించారు. దాన్ని ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు అందజేశారు.

'సిటిజన్స్ ఫర్ బెంగళూరు' అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన పిలుపుతో నగరం నలుమూలల నుంచి ప్రజలు ఒక్కచోటికి చేరారు. రోజూ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

విస్తృత సమాలోచనల అనంతరం 'బెంగళూరు బేకు'(అంటే 'బెంగళూరుకి ఇది కావాలి') పేరుతో మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశారు.

ట్రాఫిక్ సమస్య, రోడ్లు, కాలుష్యం, చెత్త నిర్వహణ, పారిశుద్ధ్యం, పాదచారుల హక్కులు, నివాసం.. ఇలా మొత్తం 13 అంశాలను అందులో పొందుపరిచారు. ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)