కర్నూలులో కొత్త ఐడియా

కర్నూలులో కొత్త ఐడియా

తెలుగు రాష్ట్రాల్లోఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడి పోతున్నారు. ఎండకు ఒక్క నిమిషం కూడా రోడ్డుపై నిలబడే పరిస్థితి లేదు.

ఇక ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మండుటెండలో నరకయాతన అనుభవించాల్సిందే.

దీన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. బాగా రద్దీగా ఉన్న కూడళ్ల దగ్గర వాహనదారులకు ఎండ తగలకుండా శేడ్ నెట్స్‌తో పందిళ్లను ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.