సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?

సచిన్

"హ్యాపీ బర్త్ డే సచిన్..!"

భారత క్రికెట్ చరిత్రలో ఏప్రిల్ 24కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. కారణం అది సచిన్ పుట్టిన రోజు కావడమే.

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల సునామీ సృష్టించిన భారత రత్న సచిన్ టెండూల్కర్ 46వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆయన క్రీడా ప్రస్థానాన్ని చిత్రాల రూపంలో చూద్దాం.

 • 1973: ఏప్రిల్ 24న బాంబే(ప్రస్తుత ముంబయి)లో జన్మించారు.
 • 1989 అక్టోబర్‌లో భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్ సందర్భంగా తీసిన చిత్రం.
 • 1990: ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టారు. టెస్టు మ్యాచుల్లో అతను చేసిన తొలి శతకం అదే. ఆ తర్వాత మూడేళ్లకు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 165 పరుగులు సాధించి, భారత్‌ను గెలిపించారు సచిన్.
 • 1989: పదహారేళ్ల వయసులో భారత్- పాకిస్తాన్‌ టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.
 • 1999: వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో సచిన్‌తో మాట్లాడుతున్న బ్రిటన్ రాణి.
 • 2004 మార్చి 4: వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ పర్యటనకు వెళ్లేందుకు భారత జట్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్నద్ధమవుతోంది. ఆ సమయంలో సచిన్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతున్న ఆయన అభిమానులు
 • 2005: టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక శతకాలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సచిన్ బ్రేక్ చేశారు. దాంతో సచిన్‌‌ 'లిటిల్ మాస్టర్' గా గుర్తింపు పొందారు.
 • 2008: టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించారు. అంతకుముంద వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారా పేరిట 11,953 పరుగులతో ఆ రికార్డు ఉంది.
 • సచిన్ టెన్నిస్ అంటే కూడా ఎంతో ఇష్టం. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటు చూసేందుకు కూడా వెళ్తుంటారు. 1989లో సచిన్ టెన్నిస్ ఆడుతున్న చిత్రం ఇది.
 • 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ద్విశతకం చేసి నాటౌట్‌గా నిలిచిన సచిన్‌కు అభినందనలు చెబుతున్న అప్పటి టీమిండియా కెప్టెన్ ధోనీ. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ అదే. అది ప్రపంచ రికార్డుగా నిలిచింది. అయితే, దాన్ని 2011 డిసెంబర్‌లో సెహ్వాగ్ బ్రేక్ చేశారు.
 • 2011: ప్రపంచకప్‌ సాధించిన భారత్. సచిన్ తన ఆరో ప్రయత్నంలో ప్రపంచ కప్ సాధించారు.
 • సచిన్‌ 'క్రికెట్ దేవుడు' అని ఆయన అభిమానులు అంటారు. ఆయన ఎక్కడికెళ్లినా తమ అభిమాన హీరోను చూసేందుకు ఎగబడతారు. ఇది లండన్‌లో తీసిన చిత్రం.
 • 2012: మార్చిలో భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 100వ శతకం(అంతర్జాతీయ క్రికెట్‌లో), వన్డే మ్యాచ్‌ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఆ ఏడాది డిసెంబర్‌లో ప్రకటించారు.
 • 2013: ముంబయిలో 200వ శతకం పూర్తి చేసి టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)