బెంగళూరు: 'ట్రాఫిక్ ఒత్తిడి భరించలేక కొందరు ఉద్యోగాలు మానేశారు'
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బెంగళూరు: 'ట్రాఫిక్ ఒత్తిడి భరించలేక కొందరు ఉద్యోగాలు మానేశారు'

  • 25 ఏప్రిల్ 2018

బెంగళూరులో గంటల తరబడి ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకుపోవడాన్ని, దానివల్ల కలిగే ఒత్తిడిని భరించలేక కొందరు చేస్తున్న ఉద్యోగం మానేసి, వేతనం తక్కువైనా ఇంటికి దగ్గరలో ఉండేలా ఉద్యోగాలు వెతుక్కుంటున్నారని ఈ నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి సరోజా గౌడ చెప్పారు. ప్రతిభా సామర్థ్యాలు ఉండి కూడా వారు అలా చేస్తున్నారని తెలిపారు.

'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'గా పిలిచే బెంగళూరులో 1500కు పైగా బహుళజాతి(మల్టీ నేషనల్) సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి.

మౌలిక సదుపాయాల కొరత, వాహనాల కొనుగోళ్లు పెరిగిపోతుండటం వల్ల కర్నాటక రాజధానిలో ట్రాఫిక్ సమస్య అంతకంతకూ తీవ్రమవుతోంది.

బెంగళూరు వాసులు ఏటా సగటున దాదాపు 250 గంటలు ట్రాఫిక్ రద్దీలోనే గడుపుతున్నారు.

ఐటీ సంస్థల కేంద్రమైన ఎలక్ట్రానిక్ సిటీకి దారితీసే సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద నిత్యం సరోజ లాంటి ఐటీ ఉద్యోగులు వందల మంది ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుంటారు. ఇక్కడ సిగ్నల్ దాటడానికే 25 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.

ఈ జంక్షన్ వద్ద వాహనాలు సగటున గంటకు కేవలం నాలుగున్నర కిలోమీటర్ల వేగంతో కదులుతాయి.

ఎలక్ట్రానిక్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి రావడానికి మూడు, నాలుగేళ్లు పడుతుందని బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్(బీఎంఆర్‌సీ) అధికారులు చెబుతున్నారు.

రిపోర్టింగ్: షాలూ యాదవ్, బీబీసీ ప్రతినిధి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)