#ప్లాస్టిక్ ఆవులు : ‘‘మారాల్సింది మనుషులే.. జంతువులు కాదు’’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

BBC Special: ఈ ఆవులను ఎవరు చంపుతున్నారు?

  • 28 ఏప్రిల్ 2018

ఆవులు ఏం తింటాయి? ప్రశ్న కొత్తదేమీ కాదు. కానీ, 'ఆవులు గడ్డి తింటాయి' అని మాత్రం సమాధానం చెప్పకండి. ఎందుకంటే కాలం మారింది! ఆవులు గడ్డి తినే కాలం నుంచి, ప్లాస్టిక్ తినే కాలం నడుస్తోంది!

పట్టణాలు, మున్సిపాలిటీల్లోని చెత్తకుప్పలపై పడివున్న ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బ్యాగులు తినే ఆవులు ఎక్కువ కాలం బతకడం లేదు.

కరుణ సొసైటీ.. ఇలాంటి ఆవులకు ఆపరేషన్ చేసి, వాటిని సంరక్షిస్తోంది. హాలండ్‌ దేశానికి చెందిన 72 సంవత్సరాల ‘క్లెమెంటైన్ కునగ్రస్’ ఈ సొసైటీని స్థాపించారు.

1995లో అనంతపురం జిల్లా పుట్టపర్తి వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారు. ఆదరణకు నోచుకోని పశువులు, కుక్కలు, పిల్లులు, గాడిదలు, ఒంటెలు.. ఇలా ఎన్నో జంతువులు ఈమె వద్ద సేద తీరుతున్నాయి.

‘‘ఈ ప్లాస్టిక్ ఆవులను చూశాక, నేను పూర్తి శాకాహారిగా మారిపోయాను. పరిస్థితి బాగుపడాలంటే మారాల్సింది మనిషే, జంతువులకు మారాల్సిన అవసరం లేదు’ అని సొసైటీ వ్యవస్థాపకురాలు క్లెమెంటైన్ బీబీసీతో అన్నారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)