జగ్వీందర్‌సింగ్: చేతులు లేకపోయినా.. సైక్లింగ్‌లో దూసుకెళ్తున్నాడు

  • 1 మే 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: రెండు చేతులూ లేవు.. సైక్లింగ్‌లో ఛాంపియన్

జగ్వీందర్‌సింగ్ పుట్టినప్పుడే రెండు చేతులూ లేవు.

అతడిది పంజాబ్‌లోని పటియాలా జిల్లా పత్తడా పట్టణం.

జగ్వీందర్ పుట్టినప్పుడు అతడి తల్లికి ఎవరూ సాయం రాలేదు.

ఆ పిల్లవాడ్ని అనాథాశ్రయంలో వదిలేయాలని కుటుంబ సభ్యులే ఒత్తిడి చేశారు.

కానీ జగ్వీందర్ తల్లి అమర్జిత్‌కౌర్ వారిని ఎదిరించారు. తన కొడుకుని పెంచి పెద్ద చేశారు.

Image copyright Dalip Singh / BBC

చిన్నపుడు స్కూల్‌లో చేర్చటానికి ఆ అమ్మ చాలా కష్టపడాల్సి వచ్చింది.

స్కూల్‌లో అడ్మిషన్ దొరికే వరకూ అతడికి కాళ్లతో రాయటం నేర్పించిందా తల్లి.

‘‘సైక్లింగ్, రన్నింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, కుకింగ్, జిమ్ నా హాబీలు’’ అని జగ్వీందర్ చెప్తారు.

కానీ అతడికి సైక్లింగ్ నేర్పించటానికి ఎవరూ ముందుకు రాలేదు.

Image copyright Dalip Singh / BBC

‘‘నేను అన్నీ రాత్రివేళ చీకట్లోనే నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పుడు ‘నీవల్ల కాదు’ అని డిస్కరేజ్ చేసేవాళ్లు ఎవరూ చుట్టుపక్కల ఉండరు’’ అని ఆయన తెలిపారు.

జగ్వీందర్ సైకిల్లింగ్ చేసేటపుడు చూసిన వాళ్లు నవ్వేవాళ్లు. తనకు చేతులు లేవు కాబట్టి కొందరు వెక్కిరించేవాళ్లని కూడా ఆయన చెప్పారు.

‘‘రోడ్డు మీద నాకు యాక్సిడెంట్ అయితే సాయం చేయటానికి జనం పెద్దగా ముందుకు రారు. పైగా.. చేతులు లేనపుడు రోడ్డు మీదకు ఎందుకు వచ్చావని నన్ను తిట్టేవారు’’ అని వివరించారు.

Image copyright Dalip Singh / BBC

ఇప్పుడు సైక్లింగ్‌లో జగ్వీందర్ రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడలిస్ట్.

ఒడిశాలో జరిగిన కోణార్క్ ఇంటర్నేషనల్ సైక్లొథాన్‌లో పాల్గొన్నారు.

డ్రాయింగ్, సైక్లింగ్‌లలో 16 పైగా మెడల్స్ గెలుచుకున్నారు.

Image copyright Dalip Singh / BBC

‘‘నేను ఓ స్థాయికి చేరాకే జనం నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు అడగటం మొదలుపెట్టారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒక యువతి ఇష్టపడింది. కానీ ఆమె తల్లిదండ్రులు, బంధువులు సిద్ధంగా లేరు. సమాజం ఏమంటుందోనని వారి భయం’’ అని జగ్వీందర్ తెలిపారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు