తాజ్ రంగును మార్చుతోందెవరు?

  • 4 మే 2018
తాజ్

తాజ్ మహల్ తన సహజ అందాన్ని కోల్పోతోంది. ఊదా, ఆకుపచ్చ రంగుల్లోకి మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు విదేశీ సాయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

ఈ నేపథ్యంలో అసలు తాజ్ రంగును మార్చేస్తున్నది ఏంటో చూద్దాం.

తాజ్ రంగు మారడానికి కాలుష్యం, కొన్ని పురుగుల విసర్జకాలు కారణమంటున్నారు పర్యావరణ వేత్తలు.

ఇదే అంశంపై పర్యావరణ వేత్త ఎంసీ మెహతా మాట్లాడుతూ.. రంగు మారడానికి కారణాలు.. ఒకటి వాయు కాలుష్యం చాలా పరిశ్రమలు ఇక్కడున్నాయి. రెండోది వాయు కాలుష్య స్థాయి తగ్గనేలేదు. తాజ్ యమునాతీరంలో ఉంది. ఇప్పుడు ఈ నది దుర్గంధం వెదజల్లుతోంది.’’ అని అన్నారు.

ఈ ప్రాంతాన్నంతా చాలా అందంగాతీర్చిదిద్దవచ్చని భూమి మీద ఓ మినీ స్వర్గంలా మార్చవచ్చని పేర్కొన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: తాజ్ రంగును మార్చుతోందెవరు?

కానీ అలా చేయకుండా.. దీన్నంతటినీ నాశనం చేస్తున్నారని ఆందోళన వక్తం చేశారు.

పురుగులు ఈ నిర్మాణంపై దాడి చేస్తున్నాయి.. అందువల్ల అది రంగు మారుతోందనీ వివరించారు.

తాజ్‌లోని తెల్లటి మార్బుల్స్‌కి చాలా సార్లు కోటింగ్ వేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారుతోంది.

తాజ్‌ను 17వ శతాబ్దంలో ఆగ్రాలోమొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు