లబ్ డబ్బు: ముడిచమురు ధర పెరుగుదల ప్రభావం ఎలా ఉండనుంది?

  • 5 మే 2018
ప్రతీకాత్మక చిత్రం Image copyright Getty Images

ముడిచమురు ధర మళ్లీ పెరగడం మొదలైంది. ఇరాన్‌తో అణుఒప్పందం అమెరికా రద్దు చేస్తుందనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధర కాస్త పడిపోయినా, మొత్తమ్మీద చూస్తే పెరుగుతోంది.

మొన్నటిదాకా ''అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గినా భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గట్లేదు'' అని అనుకున్నాం. ఇప్పుడు ముడిచమురు ధర కూడా పెరుగుతోంది. మరి భవిష్యత్తు ఎలా ఉండనుంది?

అంతర్జాతీయంగా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

చమురు ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు ధరలు పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఓపీఈసీ-ఒపెక్)లోని దేశాలు, రష్యా చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించేశాయి. ఫలితంగా సరఫరా తక్కువైపోయింది.

అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, ఇతర అంశాలు చమురు ధరలను పెంచేస్తున్నాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionలబ్ డబ్బు: చమురు ధర పెరుగుదలతో భవిష్యత్తు ఎలా ఉండనుంది?

నాలుగేళ్లలో ఎన్నడూ ఈ ధరలు లేవు

2016 ఫిబ్రవరిలో ముడిచమురు ధర బ్యారెల్ 27 డాలర్లకు పడిపోయింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత ధర 70 డాలర్లకు చేరింది. ఫలితంగా భారత్ లాంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయి.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. దేశంలో దాదాపు 80 శాతం వరకు చమురును దిగుమతి చేసుకుంటారు. భారత్ ముడిచమురు దిగుమతుల బిల్లు ఎన్నో చిన్న దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కన్నా ఎక్కువ.

పెట్రోల్ ప్రణాళిక, విశ్లేషణ విభాగం నివేదిక ప్రకారం 2017-18లో భారత ముడిచమురు దిగుమతుల బిల్లు 8,800 కోట్ల డాలర్లు. 2018-19లో ఇది 10,500 కోట్ల డాలర్లు దాటే అవకాశముంది.

దక్షిణాసియా దేశాలన్నింటిలోకెల్లా భారత్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడి ధరల్లో సగం కంటే ఎక్కువ పన్నులే ఉంటాయి.

రవాణా వ్యయంపై డీజిల్ ధరల ప్రభావం

దేశంలో డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం రవాణా వ్యయంపై నేరుగా పడుతుంది. దానివల్ల పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. వీటిని అదుపు చేయడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుంది. పర్యవసానంగా బ్యాంకు రుణాలపై వడ్డీ పెరుగుతుంది.

అంటే భారమంతా ప్రజలే మోయాలా? ఏమో చెప్పలేం. ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కొన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ఇంధనంపై పన్నులను తగ్గంచొచ్చు. ఇంధన ధరలను నియంత్రించే వ్యవస్థను మళ్లీ తీసుకురావొచ్చు. చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల భారాన్ని ప్రజలపై రుద్దకుండా ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అక్కడ గ్రహాంతర జీవులున్నాయా.. ఎవరూ రావొద్దని అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఎందుకు హెచ్చరించింది

"కుల్‌భూషణ్ జాధవ్ కేసులో ఐసీజే ఉత్తర్వును గౌరవించకపోతే పాక్‌పై ఐరాస ఆంక్షలకు ప్రయత్నిస్తాం"

ప్రెస్ రివ్యూ: మోదీది ఓ గెలుపా? ఏంపనిచేసి గెలిచారు? -కేసీఆర్

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన కెప్టెన్.. వైట్ హౌస్‌లో అడుగు పెట్టబోనని ఎందుకు అన్నారు?

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లోని ఫొటోల్లో నిజమెంత

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...