#గమ్యం: ఎంత ఫోకస్డ్‌గా ఉన్నామనేది ముఖ్యం!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#గమ్యం: జేఈఈ అడ్వాన్సుడ్: పరీక్ష ముందురోజుల్లో ఎలా ప్రిపేర్ కావాలి?

  • 13 మే 2018

బీబీసీ న్యూస్ తెలుగు గమ్యంకు స్వాగతం.

జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఈ మధ్యే వచ్చాయి. 12.5 లక్షల మందిలో దాదాపు 2.3 లక్షల విద్యార్థులు అడ్వాన్సుడుకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మే 20న జేఈఈ అడ్వాన్సుడు పరీక్ష మొదటిసారిగా పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగబోతోంది.

ఇప్పుడు మనకున్నది కేవలం ఒక్క వారం రోజులే. ఈపాటికే మీ అందరి ప్రిపరేషన్ ఓ కొలిక్కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందేమీ లేదు. కానీ ఈ వారం రోజుల్లో ఏ రకంగా పరీక్షకు సిద్ధం కావాలి, ఏయే తేదీలను గుర్తుంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై కొన్ని సలహాలు, సూచనలు ఈ వారం 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)