కేబినెట్ మార్పులు: పీయూష్ గోయల్‌కు ఆర్థికశాఖ

  • 14 మే 2018
పీయూష్ గోయల్ Image copyright PRAKASH SINGH/GettyImages

కేంద్ర మంత్రివర్గంలో కొన్ని మార్పులు జరిగాయి. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పీయూష్ గోయల్‌కు ఆర్థికశాఖను అప్పగించినట్టు తెలిపారు.

కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న జైట్లీ పూర్తిగా కోలుకునేంత వరకు తాత్కాలికంగా ఆయన ఆ బాధ్యతల్ని నిర్వహిస్తారు.

ప్రస్తుతం రైల్వే మంత్రిగా ఉన్న పీయూష్‌కు ఇది అదనపు బాధ్యత అవుతుంది.

కాగా, సమాచార, ప్రసార శాఖను రాజ్యవర్ధన్ రాథోడ్‌కు అప్పగించారు. గత జులైలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఆ శాఖను స్మృతి ఇరానీకి అదనపు బాధ్యతగా అప్పగించిన విషయం తెలిసిందే.

అట్లాగే, ప్రస్తుతం తాగునీరు, పారిశుద్ధ్య శాఖకు సహాయమంత్రిగా ఉన్న ఎస్ఎస్ అహ్లువాలియాను ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖకు సహాయమంత్రిగా నియమించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)