BREAKING NEWS: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పే!

  • 16 మే 2018
యడ్యూరప్ప Image copyright Reuters

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే సందిగ్ధానికి తెరదించుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్పను గవర్నర్ వజుభాయి వాలా ఆహ్వానించారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. యడ్యూరప్పకు ఆహ్వానం లభించిందని వెల్లడించారు.

గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మురళీధర్‌ రావు ప్రకటించారు.

అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని యడ్యూరప్పకు గవర్నర్ సూచించారని కూడా ఆయన చెప్పారు.

Image copyright Governor of Karnataka

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)