లైంగిక నేరస్థుల జాబితా: భారత్‌లో ఎందుకు? ఇందులో ఎవరి పేర్లుంటాయ్?

  • సరోజ్ సింగ్
  • బీబీసీ ప్రతినిధి
లైంగిక నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో లైంగిక నేరాలు పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం కూడా సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీ తయారు చేయాలని నిర్ణయించింది. అదే జరిగితే ప్రపంచంలో ఇలా చేసిన దేశాల్లో భారత్ 9వ దేశం అవుతుంది.

ఇంతకు ముందు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజీలాండ్, దక్షిణ ఆఫ్రికా, ఆఫ్రికా, బ్రిటన్, ట్రినిడాడ్ టొబాగో లాంటి దేశాల దగ్గర ఇలా సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీ ఉంది.

భారత్ ఈ రిజిస్ట్రీ తయారు చేసే బాధ్యతను హోం మంత్రిత్వ శాఖలోని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకు అప్పగించింది.

ఫొటో సోర్స్, Getty Images

సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీ అంటే ఏంటి?

హోం మంత్రిత్వ శాఖ ప్రకారం

  • నేషనల్ సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీలో లైంగిక నేరాలకు పాల్పడిన వారి బయోమెట్రిక్ రికార్డ్ ఉంటుంది.
  • పిల్లలపై లైంగిక హింసకు పాల్పడ్డ వారి పేర్లు కూడా ఈ రిజిస్ట్రీలో ఉంటాయి.
  • వీటితోపాటూ ఇలాంటి నేరస్థుల స్కూల్, కాలేజ్, ఉద్యోగం, ఇల్లు చిరునామా. డీఎన్ఏ, మారు పేరుకు సంబంధించిన వివరాలు కూడా రిజిస్ట్రీలో ఉంటాయి
  • అన్నిటికంటే ముఖ్యంగా ఎన్సీఆర్బీ కోసం ఈ రిజిస్ట్రీని బయటి ప్రైవేటు కంపెనీ తయారు చేస్తుంది. దాని కోసం టెండర్లు పిలుస్తారు

ఫొటో సోర్స్, Getty Images

ఈ లిస్ట్ అవసరం ఏముంది?

మూడేళ్ల కిందటే భారత్‌లో ఇలాంటి ఒక సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీ తయారు చేయాలని change.orgలో ఒక పిటిషన్ వేశారు. ఇప్పటివరకూ 90 వేల మంది దీనికి తమ మద్దతిస్తామని తెలిపారు.

"నేను నిర్భయ ఘటన విని చాలా బాధపడ్డా. ఒక సాధారణ పౌరురాలుగా ఇలాంటి నేరాలను అణచి వేయడానికి ఏదైనా చేయాలని అనుకున్నా. అందుకే ఈ పిటిషన్ వేశా" అని దాన్ని వేసిన మడోనా రోజారియో జాన్సన్ బీబీసీకి చెప్పారు.

పిటిషన్ వేయాలనే తన లక్ష్యం గురించి చెబుతూ "ఇలాంటి నేరాల గురించి రిజిస్టర్ ఉండడం వల్ల ఎవరినైనా పనికి పెట్టుకోవాలి అనుకునే వారికి సులభంగా ఉంటుంది. అందుకే సామాన్యులకు కూడా దీన్ని చూసే అధికారం ఉండాలని నేను భావిస్తున్నాను. అలా కుదరనప్పుడు పోలీసులకు ఆ అధికారం ఇవ్వవచ్చు. కనీసం పోలీసు వెరిఫికేషన్‌లో అయినా ఆ విషయం బయటపడుతుంది" అని ఆమె చెప్పారు.

కానీ అలాంటి వారు మళ్లీ జీవితాన్ని ప్రారంభించడానికి ఇది సమస్యలు సృష్టించదా?

ఈ ప్రశ్నకు జవాబుగా "పిల్లలపై లైంగిక హింసకు పాల్పడిన దోషులు ఎవరైనా ఉంటే, వాళ్లను స్కూళ్లలో పనిలో పెట్టుకోకూడదు. కానీ కొత్త జీవితంలో వాళ్లు ఏవైనా కూలి పనులు చేసుకోవాలనుకుంటే, వారికి కచ్చితంగా ఒక అవకాశం లభిస్తుంది" అని మడోనా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇందులో సమస్యేంటి?

కానీ నేషనల్ సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీకి కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చినప్పటి నుంచి భారత్ లో మానవహక్కుల పరిరక్షణ కోసం పోరాడే ఎన్నో సంస్థలు నుంచి దీనిపై ఆభ్యంతరం వ్యక్తం చేయడం ప్రారంభించాయి.

లైంగిక హింసకు గురైన వారి హక్కుల సాధన కోసం పోరాడే నేషనల్ హ్యూమన్ రైట్స్ వాచ్ "ఎవ్విరీ వన్ బ్లేమ్స్ మీ" అనే ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ రచయిత జయశ్రీ సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీ గురించి బీబీసీతో మాట్లాడారు.

"అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి రిజిస్ట్రీ మొదటి నుంచీ ఉంది. సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీ వల్ల ఉపయోగాలు తక్కువ, నష్టం ఎక్కువని ఆ దేశంలో గుర్తించారు" అని జయశ్రీ అంటారు.

ఈ రిజిస్ట్రీపై అభ్యంతరం వ్యక్తం చేసిన జయశ్రీ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాచ్ రెండో రిపోర్ట్ గురించి కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

నో ఈజీ ఆన్సర్స్: అమెరికా సెక్స్ అఫెండర్ చట్టాల ప్రకారం

  • సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీ తర్వాత అందులో ఉన్న వారి భద్రత ప్రమాదంలో పడవచ్చు.
  • సామాన్యులు చూడడం కోసం ఈ జాబితాలో ఏయే కేసులు ఉంచారో, వాటిలో ఉన్న వారికి జనం నుంచి వేధింపులు ఎదురవ్వచ్చు.
  • చాలా కేసుల్లో నిందితులు ఇంటికి - కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌ విషయంలో జయశ్రీ తన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఎన్సీఆర్బీ గణాంకాలను బట్టి "భారత్‌లో జరిగిన లైంగిక నేరాల్లో ఎక్కువగా ఇంట్లో వారు, దూరపు బంధువులే నేరస్థులుగా ఉన్నారు. ఎన్సీఆర్బీ గణాంకాలు కూడా దీన్ని స్పష్టం చేస్తున్నాయి. అలాంటి కేసుల్లో రిపోర్ట్ చేయడం కూడా తక్కువగా ఉంటుంది. కుటుంబంలో మిగతా సభ్యుల కేసు విషయంలో పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే ఒత్తిడి వల్ల వారు అలా చేస్తుంటారు. అలాంటప్పుడు వారి పేర్లు సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీలో కనిపించడం మొదలైతే ఆ ఒత్తిడి మరింత పెరుగుతుంది" అని ఆమె చెబుతారు.

2016లో ఎన్సీఆర్బీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సుమారు 35 వేల అత్యాచారం కేసుల్లో బాధితులకు బాగా దగ్గరివారే దోషులుగా తేలారు. వీరిలో తాతలు, తండ్రులు, సోదరులు, సమీప బంధువులు, పక్కింటి వారు కూడా ఉన్నారు. అందుకే మనకు బాగా తెలిసిన వారు అత్యాచారం చేయరని అనుకోవడం తప్పు.

డేటా ప్రొటెక్షన్ గురించి కూడా జయశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. "మన దేశంలో డేటా ఎంత సురక్షితంగా లేదో ఆధార్ కార్డ్ విషయంలో చూశాం. మిస్డ్ కాల్, ఆధార్ కార్డ్, ఫేస్‌బుక్, ఇతర యాప్‌ల ద్వారా సేకరించిన డేటాను కాపాడుకోవడం గురించి మన మనసులో తరచూ ఎన్నోప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని బట్టి సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీలో ఉన్న వారి పేరు, బయోమెట్రిక్ డీటెయిల్స్ ఎంత సురక్షితంగా ఉంటాయి, అనేది ఆందోళన కలిగించే విషయమే"

ఫొటో సోర్స్, Getty Images

ఇతర దేశాల్లో సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీ

1997 తర్వాత నుంచి లైంగిక హింసకు పాల్పడే నేరస్థులకు బ్రిటన్ ఇలాంటి రిజిస్ట్రీ ఏర్పాటు చేసింది.

లైంగిక వేధింపుల కేసుల్లో దోషులకు వేసే శిక్ష అధారంగా, వారి పేరు ఎప్పటివరకూ రిజిస్ట్రీలో ఉండాలనేది నిర్ణయిస్తారు.

తక్కువ శిక్ష పడితే వారి పేరును ఈ రిజిస్ట్రీ నుంచి త్వరగా తీసేయడానికి అవకాశం ఉంటుంది.

కానీ బ్రిటన్‌లో ఎవరి పేరునైనా ఈ రిజిస్ట్రీలో జీవితాంతం ఉండేలా ఎక్కిస్తే, ఆ నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం వారికి ఉంటుంది.

హోం మంత్రిత్వ శాఖ చెబుతున్న దాని ప్రకారం భారత్‌లో కూడా లైంగిక హింసకు పాల్పడిన వారి పూర్తి క్రిమినల్ హిస్టరీని ఈ రిజిస్ట్రీలో ఉంచుతారు.

ఒక సెక్స్ అఫెండర్ వల్ల సమాజానికి తక్కువ ప్రమాదం ఉంటే, వారి డేటాను 15 ఏళ్ల వరకూ రిజిస్ట్రీలో ఉంచుతారు.

ఎవరి వల్లైనా సమాజానికి ఎక్కువ ప్రమాదం అని భావిస్తే, అలాంటి నేరస్థుల రికార్డ్ రిజిస్ట్రీలో 25 ఏళ్ల వరకూ ఉంటుంది.

కానీ ఒకటి కంటే ఎక్కువ సార్లు ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తే, వారి రికార్డ్ రిజిస్ట్రీలో జీవితాంతం ఉండిపోతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)