ఐపీఎల్: ఇడ్లీ సాంబార్ Vs హైదరాబాద్ దమ్ బిర్యానీ

  • 27 మే 2018
గెలుపు ఎవరిది Image copyright twitter.com/SunRisers

ముంబయి వాంఖడే మైదానంలో 11వ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

టాస్: చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేస్తోంది.

విజయావకాశాలపై విశ్లేషణ..

ఏప్రిల్ 7న మొదలైన ఈ ఐపీఎల్ సీరీస్‌లో లీగ్ మ్యాచులు ఈ నెల 20న పూర్తయ్యాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్‌కి అర్హత సాధించాయి.

ఫైనల్‌కు అర్హత కోసం జరిగిన మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి.

ఇందులో రెండు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.

తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

రెండో ఫైనల్ అర్హత మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడగా సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పరుగుల తేడాలో విజయం సాధించి ఫైనల్‌కి అర్హత సాధించింది.

Image copyright Image copywriteTWITTER / IPL

ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు సార్లు (2010, 2011), సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారి (2016) కప్పు గెలిచాయి.

అయితే తాజా ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న అంశంపై ఇప్పుడు చర్చ నెలకొంది.

ఈ అశంపై సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లోక్‌పల్లి మాట్లాడుతూ.. ‘రెండు జట్లూ ఇప్పటి వరకూ చాలా బాగా అడాయి. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లలో మాత్రమే కాకుండా వ్యూహాల్లోనూ రెండు జట్లూ సమాన స్థాయిలో ఉన్నాయి..’ అని చెప్పారు.

అయితే.. అనుభవం, సుదీర్ఘ విజయాల విషయంలో చెన్నై జట్లు ముందంజలో ఉంది. అలాగని హైదరాబాద్ జట్టు కూడా తక్కువైందేమీ కాదు.. అని విజయ్ లోక్‌పల్లి చెప్పారు.

Image copyright Getty Images

మూడు ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై జట్లు ఓడిపోయిన సందర్భాలను ప్రస్తావించినపుడు.. ''ఆ మ్యాచ్‌లకు ఈ రోజు జరిగే మ్యాచ్‌లకూ సంబంధం లేదు..’’ అని చెప్పారు. కేవలం రెండు బంతుల్లోనే ఆట దిశ మారిపోగలదని అన్నారు.

హైదరాబాద్‌కు రషీద్ ఖానే బలం

హైదరాబాద్ జట్టుకు బౌలర్ రషీద్ ఖాన్ చాలా బలమని.. అయితే ఇతన్ని ధోనీ సమర్థవంతంగా ఎదుర్కొనగలరని విజయ్ లోక్‌పల్లి విశ్లేషించారు.

అలాగే చెన్నై జట్టులో రైనా, షేన్ వాట్సన్,, అంబటి రాయుడులు కూడా బ్యాటింగ్‌లో రాణించే అవకాశముందని వివరించారు.

Image copyright DIBYANGSHU SARKAR
చిత్రం శీర్షిక శిఖర్ ధవన్

ఇక హైదరాబాద్ జట్టులోని శిఖర్ ధావన్, యూసఫ్ పఠాన్, కేన్ విలియమ్స్‌లను కట్టడి చేయడం కూడా చెన్నైకి అంత సులభం కాదు.

భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, షకీబ్, సిద్దార్థ్ వంటి హైదరాబాద్ జట్టు బౌలర్లను చెన్నై ఎలా ఎదుర్కొంటుందనేదీ చాలా కీలకమని విజయ్ లోక్‌పల్లి వివరించారు.

చిత్రం శీర్షిక శ్రీరాం శ్రీధరన్

మరి చెన్నై బలం ఏంటి?

‘‘ఈ సిరీస్‌లో చెన్నై జట్టు హైదరాబాద్‌పై మూడు మ్యాచుల్లో గెలిచింది. పైగా గతంలో ఈ జట్టుతో ఆడిన అనుభవం ఇప్పుడు చెన్నైకి కాస్త ఎక్కువగా ఉపయోగపడొచ్చు.. ’’ అని మాజీ క్రికెటర్ శ్రీరాం శ్రీధరన్ బీబీసీతో చెప్పారు.

చెన్నై మూడు ఫైనల్స్‌లో ఓడిపోయిన అంశాన్ని ప్రస్తావించినపుడు అది చెన్నైకి పెద్ద ఇబ్బందికరమైన అంశమేమీ కాదని శ్రీధరన్ చెప్పారు.

చెన్నై కెప్టెన్ ధోనీ అనుభవం ఫైనల్లో చెన్నైకి కలిసొచ్చే అంశమని వివరించారు.

రషీద్ ఖాన్‌ని గతంలో రాయుడు బాగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాయుడు, సురేశ్ రైనాలు రషీద్ ఖాన్‌ను బాగా ఎదుర్కొంటే చెన్నైకి కలిసొస్తుందని శ్రీధరన్ చెప్పారు.

సోషల్లో సెటైర్లు

సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌పై చాలా సెటైర్లు వినిపించాయి.

విజయం చెన్నై ఇడ్లీ సాంబార్‌దా లేక.. హైదరాబాద్ దమ్ బిర్యానీదా అంటూ చాలా పోస్టులు కనిపించాయి.

ట్విటర్లో హైదరాబాద్ రీజియన్‌లో #SRHvCSK హాష్ ట్యాగ్ టాప్‌లో నిలిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

వలస కార్మికుల వల్ల కరోనావైరస్ గ్రామాలు, పట్టణాలకు చేరిందా

లాక్‌డౌన్‌లో మ్యూజిక్ వీడియోలు తీయడం ఎలా

మొన్న ఏనుగు... ఇప్పుడు ఆవు... : ప్రెస్ రివ్యూ

కృత్రిమ మేధ‌స్సు: క‌రోనావైర‌స్‌ను ఈ అధునాత‌న సాంకేతిక‌త అడ్డుకోగ‌ల‌దా

‘బాలకృష్ణ కోపంలో అలా అన్నారు కానీ..’ బీబీసీ తెలుగు ఇంటర్వ్యూలో నాగబాబు

ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా

ఈ 5 ప్రాంతాల్లో జన్మిస్తే 100 ఏళ్లు బతికేసినట్లే

బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్‌ పేరుతో శరీరాల్లో చిప్స్‌ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా

భవిష్యత్తులో ప్రయాణాలు ఇలా ఉంటాయి