ఐపీఎల్ 2018 విజేత చెన్నై సూపర్ కింగ్స్

  • 27 మే 2018
IPL Image copyright PTI

11వ ఐపీఎల్ కప్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. ముంబయి వాంఖడే మైదానంలో సన్ రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వాట్సన్ 51 బంతుల్లో సెంచరీ కొట్టి సీఎస్‌కేని విజేతగా నిలిపాడు.

ఈ విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్లో మూడుసార్లు విజేతగా నిలిచినట్టయింది. ఇంతకు ముందు 2010, 2011 ఐపీఎల్ కప్‌లను ఈ జట్టు గెలుచుకుంది.

వాట్సన్ 57 బంతుల్లో 117 పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం తేలికైంది.

అంతకు ముందు సురేశ్ రైనా 32 పరుగులు, డుప్లెసిస్ 10 పరుగులు చేసి అవుటయ్యారు.

అంబటిరాయుడితో కలిసి వాట్సన్ మ్యాచ్‌ని ముగించాడు.

అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

మ్యాచ్‌లో కీలక మలుపులు

వాట్సన్ సెంచరీ.. 51 బంతుల్లో 100

133 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే. రైనా అవుట్.

సందీప్ బౌలింగ్‌లో వరసగా మూడు సిక్స్‌లు బాదిన వాట్సన్.

సీఎస్‌కే 11 ఓవర్లు ముగిసే సరికి 100 పరుగులు పూర్తి చేసుకుంది.

సీఎస్‌కే 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది. ఇంకా 99 బంతుల్లో 60 చేయాలి.

సిక్స్ కొట్టి వాట్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సీఎస్‌కే తొలి ఆరు ఓవర్లకు 35 పరుగులు చేసింది.

డుప్లెసిస్ ఔట్. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..

సీఎస్‌కే బ్యాటింగ్ మొదలు.. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్ మేడిన్

Image copyright Pti

ఎస్ఎన్ థాకూర్ చివరి ఓవర్ వేశారు. ఆఖరు బంతికి బ్రాత్వైట్ (21) అవుటయ్యాడు.

అయిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్. డీజే హూడా (3) అవుట్.

16వ ఓవర్లో ఆఖరు బంతికి హూడా అవుటయ్యాడు.

నాలుగో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్. షాకిబ్ (23) అవుట్.

జట్టు స్కోరు 133 ఉన్నపుడు షాకిబ్ క్యాచ్ ఇచ్చాడు.

పూర్తి స్కోర్ బోర్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

15 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది.

మూడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ విలియమ్సన్ (47) అవుట్.

జట్టు స్కోరు 101 ఉన్నపుడు విలియమ్సన్ స్టంపవుట్ అయ్యాడు.

10 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్లు నష్టపోయి 73 పరుగులు చేసింది.

రెండో వికెట్ కోల్పోయిన.. సన్ రైజర్స్. శిఖర్ ధవాన్ (26) అవుట్. 69 పరుగుల వద్ద ధవాన్ అవుటయ్యాడు.

7 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది.

5 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక వికెట్ నష్టపోయి 30 పరుగులు చేసింది.

Image copyright Pti

నాలుగో ఓవర్ మేడిన్

మూడు ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక వికెట్ నష్టపోయి 17 పరుగులు చేసింది.

13 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. వినయ్ గోస్వామి రనవుట్ (5).

1.5 ఓవర్ల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ మొదటి వికెట్ తీసింది.

టాస్‌ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ మొదలుపెట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

లాక్‌డౌన్ సడలించినా నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు

బాంబులు పెట్టిన పైనాపిల్ తినిపించి ఏనుగును చంపేశారు

ఆన్‌లైన్ క్లాసెస్ వినే అవకాశం లేక ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థిని

పెను తుపాను నుంచి తప్పించుకున్న ముంబయి నగరం.. రాయగడ జిల్లాలో తీవ్ర నష్టం

ఏది ప్రమాదకరం? అల్పపీడనం, వాయుగుండం, సైక్లోన్, సూపర్ సైక్లోన్ మధ్య తేడా ఏమిటి..

హిట్ల‌ర్‌‌లా మారిపోతున్న కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు

ప్రపంచ సైకిల్ దినోత్సవం: తొలి సైకిల్ ఎప్పుడు తయారైంది? ఏటా ఎన్ని సైకిళ్లు తయారవుతున్నాయి?

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?

లాక్‌డౌన్ తర్వాత.. దిల్లీ - వైజాగ్: విమాన ప్రయాణం ఇలా సాగింది