IPL Final Live: 8 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం

  • 27 మే 2018
గెలుపు ఎవరిది Image copyright twitter.com/SunRisers

ముంబయి వాంఖడే మైదానంలో 11వ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సగం పూర్తయింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. 179 పరుగుల విజయ లక్ష్యంతో సీఎస్‌కే బ్యాటింగ్ చేస్తోంది.

మ్యాచ్‌లో కీలక మలుపులు

8 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది.

వాట్సన్ సెంచరీ.. 51 బంతుల్లో 100.

133 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే. రైనా అవుట్.

సందీప్ బౌలింగ్‌లో వరసగా మూడు సిక్స్‌లు బాదిన వాట్సన్.

సీఎస్‌కే 11 ఓవర్లు ముగిసే సరికి 100 పరుగులు పూర్తి చేసుకుంది.

సీఎస్‌కే 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది. ఇంకా 99 బంతుల్లో 60 చేయాలి.

సిక్స్ కొట్టి వాట్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సీఎస్‌కే తొలి ఆరు ఓవర్లకు 35 పరుగులు చేసింది.

డుప్లెసిస్ ఔట్. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..

సీఎస్‌కే బ్యాటింగ్ మొదలు.. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్ మేడిన్

ఎస్ఎన్ థాకూర్ చివరి ఓవర్ వేశారు. ఆఖరు బంతికి బ్రాత్వైట్ (21) అవుటయ్యాడు.

అయిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్. డీజే హూడా (3) అవుట్.

16వ ఓవర్లో ఆఖరు బంతికి హూడా అవుటయ్యాడు.

నాలుగో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్. షాకిబ్ (23) అవుట్.

జట్టు స్కోరు 133 ఉన్నపుడు షాకిబ్ క్యాచ్ ఇచ్చాడు.

పూర్తి స్కోర్ బోర్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

15 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది.

మూడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ విలియమ్సన్ (47) అవుట్.

జట్టు స్కోరు 101 ఉన్నపుడు విలియమ్సన్ స్టంపవుట్ అయ్యాడు.

10 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్లు నష్టపోయి 73 పరుగులు చేసింది.

రెండో వికెట్ కోల్పోయిన.. సన్ రైజర్స్. శిఖర్ ధవాన్ (26) అవుట్. 69 పరుగుల వద్ద ధవాన్ అవుటయ్యాడు.

7 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది.

5 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక వికెట్ నష్టపోయి 30 పరుగులు చేసింది.

నాలుగో ఓవర్ మేడిన్

మూడు ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక వికెట్ నష్టపోయి 17 పరుగులు చేసింది.

13 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. వినయ్ గోస్వామి రనవుట్ (5).

1.5 ఓవర్ల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ మొదటి వికెట్ తీసింది.

టాస్‌ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ మొదలుపెట్టింది.

(మరిన్ని లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)