IPL 2018: చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడం అంత కష్టమా?

  • 28 మే 2018
ధోనీ Image copyright PTI

ఈ క్రికెట్ కథ పదేళ్ల క్రితం నాటిది. లలిత్ మోడీ క్రికెట్‌లో ఒక సంచలనం సృష్టించారు. దానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే రూపం ఇచ్చారు.

కానీ అసలు సిసలు పోటీ, క్రికెట్ మైదానం కంటే ముందు కార్పొరేట్ ప్రపంచంలోని చురుకైన మెదళ్లు, భారీ జేబుల మధ్య జరిగింది.

2008లో వీబీ చంద్రశేఖర్ చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ సెలక్టర్‌ డైరెక్టర్‌, క్రికెట్ ఆపరేషన్స్‌గా ఉండేవారు. ఆటగాళ్ల వేలం పాట మొదలవడానికి ఇక కొన్ని గంటలే ఉంది.

టీమ్ యజమాని, ఇండియా సిమెంట్స్ బాస్ ఎన్.శ్రీనివాసన్ ఆయన్ను "నువ్వు ఎవరిని సెలక్ట్ చేయబోతున్నావ్" అని అడిగారు. దాంతో చంద్రశేఖర్ "ధోనీ" అని చెప్పారు. ఆయన మరో ప్రశ్న వేశారు. "వీరేంద్ర సెహ్వాగ్ వద్దా?" అన్నారు. వాళ్లు తాము ఎంచుకున్న ఆటగాళ్ల కోసం చాలా సేపు వాదించుకున్నారు.

శ్రీనివాసన్ మళ్లీ "నేను సెహ్వాగ్‌ను ఎంచుకునేవాణ్ణి" అన్నారు.

చంద్రశేఖర్‌కు రాత్రంతా నిద్రపట్టలేదు. కానీ తర్వాత రోజు ఉదయం ఆయనకు మరో సర్‌ప్రైజ్ ఎదురవబోతోంది. ఉదయం శ్రీనివాసన్ ఆయన దగ్గరికి వచ్చి, ఒకే మాట అన్నారు. "ధోనీ మన టీమ్‌లో ఉండాలి"

Image copyright AFP/Gettyimages
చిత్రం శీర్షిక శ్రీనివాసన్

ధోనీ చెన్నై సొంతం ఎలా అయ్యాడు

చంద్రశేఖర్ జరిగిన మొత్తం కథను ఒక క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఈ ఆసక్తికరమైన కథలో సగం నిండిపోయింది.

వేలం ప్రారంభించగానే, టీమ్ కోసం ఆటగాళ్లను కొనడానికి 50 లక్షల డాలర్లు ఖర్చు పెట్టచ్చని చంద్రశేఖర్ అనుకున్నారు. కానీ వాటిలో ఆయన ధోనీ కోసం 11 లక్షల డాలర్లు మాత్రమే కేటాయించగలరు.

కానీ మరో టీమ్ కూడా ధోనీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయనకు సమాచారం అందింది. చంద్రశేఖర్ తన వేలం మొత్తాన్ని 14 లేదా 15 లక్షల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. తర్వాత ధోనీ కోసం 18 లక్షల వరకూ వెళ్లబోతున్నారని అక్కడంతా వార్తలు వ్యాపించాయి.

దాంతో చంద్రశేఖర్ చెయ్యి పైకెత్తారు. ఎదుకంటే అంత డబ్బు ధోనీ కోసం పెట్టేస్తే, గెలవగలిగే టీమ్ కొనడానికి తన దగ్గర ఇక డబ్బు మిగలదని ఆయనకు తెలుసు.

కానీ అదృష్టం చంద్రశేఖర్, శ్రీనివాసన్‌నే వరించింది. 2008లో 15 లక్షల డాలర్లకు ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆ తర్వాత జరిగింది అంతా ఒక చరిత్ర.

ఇది పసుపు రంగు దుస్తుల్లో మైదానంలో మెరిసిన ఆ టీమ్ చరిత్ర

Image copyright AFP/gettyimages

CSK అంటే దేశమంతా అభిమానం

ఏ జట్టును సొంతగడ్డపై ( చిదంబరం స్టేడియం, చెన్నై) ఓడించడం అసాధ్యంగా భావిస్తారో ఆ టీమ్, రాజకీయ వివాదాలతో తన ఇంటిని వదిలి పుణెను తాత్కాలిక నివాసంగా మార్చుకోవాల్సి వచ్చింది. అయినా ముంబై ఇండియన్స్ కంటే ఎక్కువగా అభిమానుల మనసు దోచింది.

జాతరకు వెళ్లినట్టు ఈ టీమ్ కోసం చెన్నై అభిమానులు రైళ్లలో పుణె చేరుకునేవారు. జార్ఖండ్ నుంచి వచ్చే అభిమానులు "నమ్మ తలా, విజిల్ అడింగ" అని స్డేడియంలో అరిచేవాళ్లు. మా కెప్టెన్ ధోనీకి విజిల్ వేయండి అనే తమిళ మాటతో ఊగిపోయేవాళ్లు.

ఇది చదువుతున్న మీకు "ఈ కథ చెన్నై సూపర్ కింగ్స్ గురించి కదా, అంతా ధోనీ గురించే ఎందుకు చెబుతున్నారు" అని అనిపించచ్చు. ఈ ప్రశ్న ఎంత సాధారణమైనదో, సమాధానం కూడా అంతే సులభంగా ఉంటుంది.

Image copyright AFP/GettyImages

ధోనీయే హీరో

నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ పదేళ్ల మొత్తం చరిత్రలో అసలు సిసలు హీరో మహేంద్ర సింగ్ ధోనీనే. CSK యజమాని కంపెనీ పేరు ఇండియా సిమెంట్స్. ధోనీ ఎలాంటి సిమెంట్ అంటే, ఈ క్రికెట్ టీమ్‌ను ఒక భవనంలా మార్చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీ ఏ స్థానంలో ఉన్నాడో, ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఇంచుమించు అదే స్థానంలో ఉంటుంది.

హైదరాబాద్ దగ్గర బహుశా ప్రమాదకరమైన బౌలింగ్ అటాక్ ఉంది. పంజాబ్ దగ్గర క్రిస్ గేల్ అనే తుఫాన్ ఉంది. బెంగళూరు దగ్గర విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ దగ్గర యువ ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్‌ టీంలో రహానే, కేకేఆర్ దగ్గర సునీల్ నారాయణ్, ఢిల్లీ జట్టులో అప్పుడప్పుడూ మెరిసే తారలు ఉన్నారు. కానీ చెన్నై దగ్గర గెలిచే జట్టు ఉంది. గెలిపించే కెప్టెన్ ఉన్నాడు.

Image copyright AFP/GettyImages

చెన్నైని తిరుగులేని టీమ్‌గా ఎందుకు భావిస్తారు?

కానీ టీమ్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన టీమ్ ఎందుకు అయ్యిందంటే, వికెట్ కీపర్ నైపుణ్యం, కెప్టెన్ ఎత్తులు ఎవరి దగ్గర ఉంటే వారిని జీనియస్ అంటారు. బహుశా అందుకే ఈ టీమ్ ఈ టోర్నమెంట్‌లో కంప్లీట్ టీమ్‌గా, తిరుగులేని జట్టుగా నిలిచింది.

కథ ఇప్పుడు 2008 నుంచి 2018 వరకూ వచ్చింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఆకలి తీరలేదు, గెలిచే సత్తా తగ్గలేదు.

వరల్డ్ కప్ అయినా, ఐపీఎల్ అయినా సరైన సమయంలో పికప్ అయ్యేవారే టోర్నమెంట్ గెలుస్తారు. 2018లో ఐపీఎల్ ఫైనల్లో చెన్నై వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగింది కాబట్టి ఇది గుర్తుండిపోతుంది.

2008 నుంచి 2018 వరకూ

2008లో మొదటి ఐపీఎల్ ఫైనల్ చేరినా కొద్దిలో ఓటమి పాలైన చెన్నై టైటిల్ గెలుచుకోలేకపోయింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తర్వాత 2009లో చెన్నై సూపర్ కింగ్స్ కు అదృష్టం కలిసి రాలేదు. ఆ ఏడాది జట్టులో అత్యంత విలువైన ఆటగాడు అయిన ఆండ్రూ ఫ్లింటాఫ్ గాయంతో మూడు మ్యాచ్‌లే ఆడగలిగాడు. హసీ కూడా త్వరగా తిరిగి వెళ్లిపోయాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన మాథ్యూ హెడెన్ చెన్నైని ఫైనల్ వరకూ చేర్చలేకపోయాడు. కానీ తర్వాత ఏడాది చెన్నై తన సత్తా చూపించింది. 2010లో ధోనీ టీమ్ మొత్తం టోర్నమెంట్‌ చాంఫియన్‌లా ఆడి టైటిల్ దక్కించుకుంది.

2011లో కూడా చెన్నై విజయ పరంపర కొనసాగింది. ఎల్బీ మార్కెల్, బద్రీనాథ్ లాంటి కొత్త ఆటగాళ్లు రావడం, కొంతమంది పాత ఆటగాళ్లు ఉండడంతో ముందుకు దూసుకెళ్లింది. వరసగా రెండో సారి ఐపీఎల్ కప్పు అందుకున్న మొదటి జట్టుగా నిలిచింది.

తర్వాత 2012లో ఐపీఎల్‌లో అందరూ ఒకే టీమ్‌ను ఓడించాలని లక్ష్యంగా బరిలో దిగారు. అదే చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఫైనల్‌లో ఓడిపోయింది. 2013లో కూడా అలాగే జరిగింది. మరోసారి ఫైనల్లో చెన్నై ఓటమి పాలైంది.

2014లో మరోసారి ఐపీఎల్ వేలం జరిగింది. చెన్నై ధోనీ, రైనా, అశ్విన్, జడేజా, బ్రావో రిటైన్ చేయాలని నిర్ణయించింది. బ్రండన్ మెక్ కలమ్, డుప్లెసీ, నెహ్రా, మోహిత్ శర్మ టీమ్‌కు తోడయ్యారు. ఆ ఏడాది కూడా టీమ్ ఆట అటూ ఇటూ అయ్యింది. వరసగా గెలిస్తే, వరసగా ఓడిపోయింది. కానీ కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమి పాలై టైటిల్‌కు దూరమైంది.

2015లో టీమ్ కొంతమంది ఆటగాళ్లను వదులుకుని, కొందరు కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కానీ టీమ్ ప్రదర్శనలో మాత్రం మార్పు రాలేదు. ఆ ఏడాది ఫైనల్ చేరిన చెన్నై ముంబై చేతిలో ఓడింది.

ఒకప్పుడు బ్యాట్స్‌మెన్ మ్యాచ్ గెలిపిస్తే, బౌలర్ టోర్నమెంట్ గెలిపిస్తాడని అనేవారు. కానీ ఐపీఎల్‌లో అది మారిపోయింది. టీ20 మ్యాచ్‌ను ఆల్‌రౌండర్ గెలిపిస్తాడు. చెన్నై దగ్గర మంచి ఆటగాళ్లకు ఎప్పుడూ లోటు లేదు.

మొదట్లో ఎల్బీ మార్కెల్ ఉంటే, ఇప్పుడు వాట్సన్ ఉన్నాడు. అశ్విన్ అప్పుడు ఉంటే, ఇప్పుడు జడేజా ఉన్నాడు. డ్వేన్ బ్రావో అప్పుడు, ఇప్పుడూ కొనసాగుతున్నాడు. ధోనీ ఎప్పుడూ చెన్నైతోనే ఉన్నాడు. కానీ 2015 తర్వాత రెండేళ్లు ఐపీఎల్ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు చుట్టుముట్టాయి.

Image copyright AFP/GettyImages

చెన్నై కింగ్స్ కష్టాలు

అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ వలలో ఇరుక్కున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను చివరికి రెండేళ్లు టోర్నమెంట్ నుంచి తప్పించారు. టీమ్‌లోని ఆటగాళ్లు అందరూ విడిపోయారు. వేరే వేరే టీమ్స్ లో భాగమయ్యారు.

ఒక కొత్త టీమ్ ఏర్పడగానే, ధోనీ అందులో భాగం అయ్యారు. చెన్నై టీమ్‌లోని మరికొందరు ఆటగాళ్లను కూడా పుణె కొనుగోలు చేసింది. కానీ ఆ సత్తా లేకుండా పోయింది. ధోనీ జెర్సీ రంగు మారగానే తన రంగు వెలిసిపోయినట్టు అనిపించింది.

తర్వాత కథ మారింది. చెన్నైకి మళ్లీ తన పాత కెప్టెన్ దొరికాడు. కొందరు పాత ఆటగాళ్లు కూడా తిరిగి వచ్చారు. దానితపాటూ రకరకాల దేశాల ఆటగాళ్లందరూ ఒకే దగ్గర ఉండేలా చేసే డగ్‌అవుట్ దొరికింది. ఇది అందరినీ ఒక్కటి చేసింది.

ఇది 2008 కాదు, 2018. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పడింది. ఇప్పుడు విడిపోయి మళ్లీ ఒక్కటైంది. ధోనీ మళ్లీ పసుపు జెర్సీలోకి వచ్చాడు. చివరికి విజయం కూడా వారి దగ్గరకు తిరిగి వచ్చి చేరింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

లాక్‌డౌన్ సడలించినా నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు

బాంబులు పెట్టిన పైనాపిల్ తినిపించి ఏనుగును చంపేశారు

ఆన్‌లైన్ క్లాసెస్ వినే అవకాశం లేక ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థిని

పెను తుపాను నుంచి తప్పించుకున్న ముంబయి నగరం.. రాయగడ జిల్లాలో తీవ్ర నష్టం

ఏది ప్రమాదకరం? అల్పపీడనం, వాయుగుండం, సైక్లోన్, సూపర్ సైక్లోన్ మధ్య తేడా ఏమిటి..

హిట్ల‌ర్‌‌లా మారిపోతున్న కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు

ప్రపంచ సైకిల్ దినోత్సవం: తొలి సైకిల్ ఎప్పుడు తయారైంది? ఏటా ఎన్ని సైకిళ్లు తయారవుతున్నాయి?

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?

లాక్‌డౌన్ తర్వాత.. దిల్లీ - వైజాగ్: విమాన ప్రయాణం ఇలా సాగింది