మూతబడిన స్టెర్లైట్

  • 28 మే 2018
స్టెర్లైట్ పరిశ్రమ మూత Image copyright Getty Images

తూత్తుక్కుడి జిల్లాలో తీవ్ర వివాదాస్పదమైన స్టెర్లైట్ రాగి పరిశ్రమను శాశ్వతంగా మూసివేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

తూత్తక్కుడి జిల్లాలో సిప్‌కాట్ వద్ద ఏర్పాటైన స్టెర్లైట్ పరిశ్రమను మూసివేయాలన్న డిమాండ్లు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించి ఇటీవల ఆందోళనలు ముమ్మరమయ్యాయి. ఈ నెల 22న ఆందోళనకారులపై పోలీసుల కాల్పులు కూడా జరిగాయి. కాల్పుల్లో 13 మంది మృతి చెందారు.

ఈ సంఘటన అనంతరం స్టెర్లైట్ పరిశ్రమకు ప్రభుత్వం విద్యుత్తు సరఫరాను ఆపేసింది.

ఈ నేపథ్యంలో సోమవారం ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తూత్తుక్కుడి వెళ్లి అక్కడ తుపాకీ కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

అనంతరం ఈయన చెన్నైకి వెళ్లాక తమిళనాడు సీఎం పళణిస్వామితో సమాలోచనలు జరిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వేదాంత యజమాని అనిల్ అగర్వాల్

తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

స్టెర్లైట్ అనుమతిని పునరుద్ధరించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరిందని.. అయితే వారు నిబంధనలను పాటించలేదని వివరించింది.

పరిశ్రమను కొనసాగించడానికి సంబంధించిన అనుమతులను పునరుద్ధరించాలన్న వినతిని ఏప్రిల్ 9న నిరాకరించినట్లు, మే 25న విద్యుత్తు సరఫరాను ఆపేసినట్లు వెల్లడించింది.

స్టెర్లైట్ పరిశ్రమను మూసేయాలంటూ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో దాన్ని మూసివేయాలని నిర్ణయించామని తమిళనాడు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు