వెండితెరపై హస్తప్రయోగం.. నెటిజన్ల ఆగ్రహం, బాలీవుడ్ నటి స్వరభాస్కర్‌ సమాధానం

  • 5 జూన్ 2018
స్వర భాస్కర్ హస్తప్రయోగం వివాదం Image copyright FB.COM/SWARA BHASKAR

బాలీవుడ్ నటి స్వరభాస్కర్‌పై సోషల్ మీడియాలో మరోసారి ట్రోల్ మొదలైంది. ఇటీవల విడుదలైన 'వీరె ది వెడింగ్‌'లో ఒక సన్నివేశం కారణంగా నెటిజనులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు.

ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో స్వరభాస్కర్ హస్తప్రయోగం చేస్తున్నట్టు చూపించారు. దీనిపై ట్విటర్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరకర పదాలతో కొందరు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

దీనికి భిన్నంగా కొంతమంది మాత్రం సినిమాలో ఆమె పాత్రను మహిళా సాధికారతకు చిహ్నంగా చెబుతున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని స్వర ఆరోపిస్తున్నారు.

Image copyright FB.COM/SWARA BHASKAR

సినిమాలోని ఈ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్తీ అగర్వాల్ అనే ఒక యూజర్ దీనిని సాఫ్ట్ పోర్న్‌గా అభివర్ణించారు.

"స్వర భాస్కర్ సాఫ్ట్ పోర్న్‌ను హాలీవుడ్ నుంచి కాపీ చేశారు. కానీ దీన్ని భారత్‌లో నిషేధించలేదు" అని ట్వీట్ చేశారు.

Image copyright TWITTER

"స్వర భాస్కర్ హస్తప్రయోగం సన్నివేశం బోల్డ్‌గా ఉంది, కానీ ఇది పెద్ద విషయమేం కాదు. ఇలా చేయడం ఫెమినిజానికి భంగం కలిగించవచ్చు. తెరపై పురుషులు ఇలాంటి సన్నివేశం చేసినా, చూడడానికి ఎవరూ ఇష్టపడరు. ఇదే ఫెమినిజం అనుకుంటే, పోర్న్ ఇండస్ట్రీ ఇప్పటికే ఎంతోమంది ఫెమినిస్టులను అందించింది" అని @oversmartme పేరుతో ఉన్న ట్విటర్ యూజర్ అన్నారు.

Image copyright TWITTER

"స్వర భాస్కర్.. నేను మా నానమ్మతో సినిమా చూశాను. ఆ హస్తప్రయోగం సన్నివేశం వచ్చినపుడు సిగ్గుతో చచ్చిపోయాను. బయటకి రాగానే ఆమె నాతో నేను హిందుస్థాన్‌ని, ఈ సినిమా గురించి సిగ్గుపడుతున్నా అంది" అని కొంతమంది యూజర్స్ ట్వీట్ చేశారు.

"ప్యాడ్ మేన్ సినిమాలో అక్షయ్ కుమార్ ప్యాడ్ పెట్టుకోవడం, స్వరా భాస్కర్ 'వీరే ది వెడింగ్‌'లో హస్తప్రయోగం చేయడం కంటే చాలా పెద్ద విషయం" అని అక్షయ్ కటారియా అనే ఒక ట్విటర్ యూజర్ అన్నారు

Image copyright TWITTER

సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరాలపై సమాధానం ఇచ్చిన స్వరభాస్కర్ "చూస్తుంటే సినిమా టికెట్లు, ట్వీట్లను కచ్చితంగా ఏదో ఐటీ సెల్ స్పాన్సర్ చేసినట్టుంది" అన్నారు.

'వీరె ది వెడింగ్' సినిమాలో స్వరాతోపాటూ కరీనా కపూర్, సోనమ్ కపూర్, శిఖా తలసానియా కూడా ఉన్నారు. తమకు నచ్చినట్టు జీవించే నలుగురు అమ్మాయిల జీవితాలను ఈ సినిమాలో చూపించారు.

Image copyright TWITTER

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)