అభిప్రాయం: ఫెమినిస్ట్ అమ్మాయిలు ఎలా ఉంటారు?
- దివ్య ఆర్య
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, VDWTheFilm/facebook
ఫెమినిస్ట్ అమ్మాయిలు ఎలా ఉంటారు? ఈ ప్రశ్నకు రెండు జవాబులు ఉండచ్చు
సాధారణంగా అంతా ఒకటే అనుకుంటారు. ఈ అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకుంటారు, మందు-సిగరెట్ తాగుతారు, రాత్రీపగలూ పార్టీల్లో మునిగి తేలుతారు.
వీళ్లు 'అందుబాటులో' ఉంటారు, వీరికి బాధ్యతలు లేని శారీరక బంధాలు నెరపడంలో ఏ సమస్యా ఉండదు. అబ్బాయిలను తమ కంటే నీచంగా చూస్తారు.
సమానత్వం పేరుతో పురుషులు చేసే అన్నింటినీ తాము కూడా చేయాలని వీళ్లు మొండిగా ఉంటారు. ఉదాహరణకు బూతులు తిడతారు, ఇతరులను సెక్స్ వస్తువుల్లా చూస్తారు.
అసలు సిసలు, 'ఫెమినిస్టు' అమ్మాయిలు ఎలా ఉంటారు? ఈ సమాధానం తర్వాత చూద్దాం.
ఫొటో సోర్స్, VDWTHEFILM
ఫెమినిస్టు అనిపించుకోడానికి పురుషులు జంకుతారు
'ఫెమినిస్టు' అంటే సాధారణంగా అందరూ అనుకునేదే ఎక్కువ పాపులర్ అయ్యింది. అందుకే ఎక్కువ మంది మహిళలు, పురుషులు 'ఫెమినిస్ట్' అనిపించుకోడానికి జంకుతారు.
'వీరే ది వెడింగ్' హీరోయిన్లు కూడా మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ ఒకటే చెబుతూ వచ్చారు. "ఈ సినిమా కచ్చితంగా స్వేచ్ఛ కోరుకునే నలుగురు అమ్మాయిల కథే, కానీ వారు ఫెమినిస్ట్ కాదు" అన్నారు.
అలా చెప్పడానికి కారణం, ఒకటే అనుకోవచ్చు. ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం అసభ్యంగా, అసహజంగా భావించి ఉండచ్చు. అది అసహ్యంగా ఉండే మోడ్రన్ లేదా వెస్టర్న్ రూపం అనుకోవచ్చు.
"వీరే ది వెడింగ్" సినిమాలో నలుగురు హీరోయిన్స్ చిన్న బట్టలు వేసుకుంటారు, మందు- సిగరెట్ తాగుతారు, పార్టీల్లో మునిగితేలుతారు. అది వేరే విషయం.
వారిలో ఒక హీరోయిన్ను ఒక వ్యక్తి 'అవైలబుల్' అనుకుంటాడు. మద్యం మత్తులో వారిద్దరూ శారీరక బంధం కూడా ఏర్పరుచుకుంటారు.
ఆ తర్వాత కూడా ఆ హీరోయిన్ ఆ వ్యక్తిని తనకంటే తక్కువగా చూస్తుంటుంది.
ఫొటో సోర్స్, VDWTHEFILM
సినిమా అంతా తిట్ల పురాణం
తిట్లు, బూతులు సినిమాలో తరచూ వినిపిస్తూనే ఉంటాయి. సినిమాలోని నలుగురు హీరోయిన్ల డైలాగుల్లోనూ అవి ఉంటాయి.
ఒక హీరోయిన్ తన భర్తను పొగుడుతుంది. సెక్స్ చేసే అతడి సామర్థ్యాన్ని వర్ణిస్తుంది. అంటే మనం ఆమెను సాధారణంగా 'ఫెమినిస్ట్' అనే చెప్పుకోవాలి.
సినిమా కథ అంతా నలుగురు మహిళల స్నేహం గురించే అయినా, బాలీవుడ్లో మొదటిసారి పురుషుల స్నేహానికి భిన్నంగా మహిళలనే హీరోలుగా చేసి, వారి స్నేహం చుట్టూ అన్నీ అల్లే ప్రయత్నం చేశారు.
నేను ఈ సినిమా చూడ్డానికి వెళ్లినపుడు, ఒకటే ఆశించాను, మారుతున్న ప్రపంచంలో, మారుతున్న మహిళల కథ చూస్తాననే అనుకున్నాను.
ఫొటో సోర్స్, VDWTHEFILM
అంతా పైపైనే తేల్చేసిన సినిమా
ఇది మగవాడి చుట్టూ తిరగదు, ప్రేమించడంతోపాటూ తన అస్థిత్వం, తన గుర్తింపు కూడా కోరుకుంటుంది. ఈ కథకు ఉద్దేశం కేవలం పెళ్లి మాత్రమే కాదు.
ఇందులో పెళ్లికి ఒక స్థానం, మిగతా వాటన్నిటికీ ఒక స్థానం ఉంటుంది. ఇందులో నలుగురు స్నేహితురాళ్ల మధ్య అమ్మాయిలు కూడా అబ్బాయిల్లాగే ఏదైనా చేయగలరు అనే ఒక ధీమా ఉంటుంది.
రకరకాల జీవితాల మధ్య నలిగిపోయే ఆ గుర్తింపును, సమాజం మన జెండర్ ద్వారా మనకు ఇస్తుంది.
మహిళలపై తరచూ పెళ్లి చేసుకోమనే ఒత్తిడి, కెరియర్ చూసుకోవాలనే కల, ఆలస్యంగా పిల్లల్ని కందామనే సంఘర్షణ ఉంటుంది.
కథలో అవన్నీ పెట్టి ఉండచ్చు. కానీ అది పైపైనే ఉండిపోయింది. కొంత వరకూ వెండి తెరపై అందరూ అనుకునే 'ఫెమినిస్ట్' మహిళలే కనిపించారు.
ఫొటో సోర్స్, VDWTHEFILM
'వీరే ది వెడింగ్' ఒక మామూలు సినిమా ఎందుకైంది
వాళ్లు 'హస్తప్రయోగం' మాట కూడా చెప్పారు. 'అప్నా హాత్ జగన్నాథ్' (మన చేయే దైవం) అంటున్నప్పుడు వాళ్లు కాస్త కూడా తటపటాయించలేదు.
సెక్స్ అవసరాల గురించి సంకోచం లేకుండా మాట్లాడారు. నలుగురిలో ఒకరైతే, హస్త ప్రయోగం చేస్తూ కూడా కనిపిస్తారు. ఆ సీన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది
కానీ అంతకు మించి ఈ సినిమా అసలు విషయాన్ని చెప్పలేకపోయింది. సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే, మూడు అడుగులు వెనక్కు వెళ్లింది.
స్వేచ్ఛాయుత ఆలోచనలతో ఉన్న ఒక 'ఫెమినిస్ట్' మహిళ, మందు-సిగరెట్-బూతులు లేకుండా కూడా తన గొంతును గట్టిగా వినిపించగలదు.
ఆమెకు పురుషులకు లభించే ప్రతిదీ హక్కుగా కావాలి. కానీ కేవలం అవన్నీ చేయగలగడం అనేది మాత్రమే స్వేచ్ఛకు ప్రామాణికం కాదు.
ఫొటో సోర్స్, VDWTHEFILM
'ఫెమినిస్ట్' అంటే, మగవాడితో పాటూ నడవడం
'ఫెమినిస్ట్' కావడంలో ఒక అందం ఉంది. 'ఫెమినిస్ట్' అంటే మగవాడిని తక్కువగా చూపించడం, లేదా వారికి వ్యతిరేకంగా ఉద్యమించడం కాదు. వారితోపాటూ నడవడం.
హోటల్లో బిల్ చెల్లిస్తున్నప్పుడు వారితో చిన్న తగవులో ఆ అందం ఉంటుంది. ఉద్యోగం చేయడంలో లేదా ఇల్లు చూసుకోవడంలోని స్వేచ్ఛలో అది ఉంటుంది.
నేను సెక్స్ వస్తువు వైపు చూడాల్సిన అవసరం లేదని, నా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, అలజడి చెందాల్సిన అవసరం లేదని అది తెలుసుకుంటుంది.
ఈ 'పెళ్లి వీరులు' నిజమే చెప్పారు వారి సినిమా 'ఫెమినిస్ట్' కాదు.
కానీ 'ఫెమినిస్ట్' అసలు అర్థం చెప్పే ఆ సినిమా కోసం, 'ఫెమినిస్టు'ను అని చెప్పుకోడానికి ఏమాత్రం సిగ్గుపడని వారితో తెరకెక్కించే ఆ చిత్రం కోసం నేను ఎదురుచూస్తూనే ఉంటా.
ఇవి కూడా చదవండి:
- ద్రౌపదిని ఫెమినిస్ట్ అనడం సరైందేనా?
- ఏది అశ్లీలత? ఏది లైంగిక స్వేచ్ఛ?
- అంగీకారానికి, అనంగీకారానికి మధ్య విభజన రేఖ ఎక్కడ?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- అమ్మాయిలంతా డాక్టర్లు, ఇంజనీర్లే ఎందుకు కావాలి?
- దక్షిణాఫ్రికా పాఠశాలలో అమ్మాయిల 'నగ్న' నాట్య ప్రదర్శనపై ఆగ్రహం
- సెక్స్ ఎడిక్షన్: ‘రోజుకి ఐదుసార్లు కూడా సరిపోయేది కాదు’
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- వివాహేతర సంబంధాల్లో ‘ఆమె’ను ఎందుకు శిక్షించరు?
- వీళ్లకు స్పీడ్ డేటింగ్ పట్ల ఎందుకింత ఆసక్తి?
- రివెంజ్ పోర్న్: అసభ్యకర చిత్రాలకు చెక్ పెట్టనున్న ఫేస్బుక్
- 'కట్నం కోసం' ఆమె 'అతడు'గా మారింది.. ఇద్దరమ్మాయిలను పెళ్లాడింది!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)