వరి సాగుకన్నా యాపిల్ తోటలే నయమంటున్న కశ్మీరీలు

వరి సాగుకన్నా యాపిల్ తోటలే నయమంటున్న కశ్మీరీలు

జమ్ము కశ్మీర్ రైతులు వరి పండే పొలాలను యాపిల్ తోటలుగా మార్చేస్తున్నారు.

వరి పొలాలను యాపిల్ తోటలుగా మార్చాక పంట చేతికి రావాలంటే కొన్నేళ్ల సమయం పడుతుంది. అయినా సరే రైతులు యాపిల్ సాగుకే మొగ్గు చూపుతున్నారు.

యాపిల్ పంట లాభసాటి అని రైతులు భావించడమే దీనికి ప్రధాన కారణం కాగా, రోజురోజుకూ తరిగిపోతున్న నీటి లభ్యత కూడా వారిని ఈ దిశగా నెట్టేస్తోంది.

దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్ గ్రామానికి బీబీసీ ప్రతినిధి యోగితా లిమయే వెళ్లారు. ఆ గ్రామంలో ఎక్కువ మంది రైతులు తమ పొలాలను యాపిల్ తోటలుగా మార్చివేయడానికి కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)