మీ సెల్ఫీ నిజంగా మీదేనా?
యూట్యూబ్‌లో అందంపై వీడియో బ్లాగులు పెట్టే ప్రముఖ వ్లాగర్లకు పెద్దసంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు యూట్యూబ్‌లో సగటున రోజూ పది లక్షలకు పైగా ఇలాంటి వీడియోలను జనం చూశారు. మరి ఈ వీడియోలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
ఎక్కువ మంది కోరుకొనే రూపురేఖల గురించే వీడియో ట్యూటోరియల్స్‌లో తరచూ చెబుతారని 'పర్ఫెక్ట్ మి' పుస్తక రచయిత్రి హీదర్ విడ్డోస్ తెలిపారు. ''వాటిలో సూచించే చిట్కాలు పాటించడం వల్ల అందరి మధ్య ఎక్కువ పోలికలు కనిపిస్తాయి'' అని ఆమె చెప్పారు.
''బ్యూటీ వీడియోల్లో ఎక్కువగా సెల్ఫీల కోసం ఎలా మేకప్ చేసుకోవాలో చూపిస్తున్నారు. ఆ సెల్ఫీలకు ఫిల్టర్లు కూడా ఉపయోగిస్తాం. మన అందాన్ని పెంచి చూపించేందుకు టెక్నాలజీనీ వాడతాం. మనది అనుకుంటున్న సెల్ఫీ నిజానికి మనది కాకపోవచ్చు. అద్దంలో కనిపించే మనం, సోషల్ మీడియాలో కనిపించే మనం ఒకేలా ఉండం'' అని హీదర్ తెలిపారు.
2017లో అంతర్జాతీయంగా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు రూ.3.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో లిప్‌స్టిక్‌లు, పౌడర్లు మొదలుకొని సౌందర్య ఉత్పత్తులన్నీ ఉన్నాయి. 2018లో ఈ విక్రయాలు ఆరు శాతం మేర పెరుగుతాయని మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ మింటెల్ అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)