ఏటీఎంలోని నోట్లను కొరికేసిన ఎలుకలు

నోట్ల కట్టలు ఏటీఎం

ఫొటో సోర్స్, TWITTER / KARMA PALJOR

పనిచేయని ఏటీఎంను బాగుచేయడానికి వెళ్లిన సాంకేతిక సిబ్బంది అక్కడి పరిస్థితిని చూసి షాకయ్యారు.

ఏటీఎం సెంటర్‌లో కరెన్సీ నోట్లు చిత్తు కాగితాల్లా పడి ఉన్నాయి. అవన్నీ రెండు వేలు, ఐదు వందల రూపాయల నోట్లే. కానీ అవి చిరిగిపోయి ఉన్నాయి.

సుమారు రూ.12 లక్షల విలువైన నోట్లు ఏటీఎం సెంటర్లోనే చిరిగిపోయి కనిపించాయి. అయితే, ఈ పనంతా చేసింది ఎలుకలు.

ఫొటో సోర్స్, Getty Images

అసోంలోని ఒక ఏటీఎం సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏటీఎం వైర్ల కోసం చేసిన రంధ్రం నుంచి ఎలుకలు లోపలికి వెళ్లి ఉండొచ్చని పోలీసులు తెలిపారని హిందూస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది.

చిరిగిన నోట్ల కుప్పల మధ్య చనిపోయిన ఒక ఎలుక కనిపించింది.

12 రోజుల నుంచి ఈ ఏటీఎం పనిచేయడం లేదని స్థానిక పోలీసు అధికారి ప్రకాశ్ సోనోవాల్ తెలిపారని హిందూస్థాన్ టైమ్స్ ప్రస్తావించింది.

రూ.2 వేలు, రూ.500 నోట్లు చిరిగిపోయినట్లు సాంకేతిక సిబ్బంది గుర్తించారు. అందులో ఉన్న మరో రూ.17 లక్షలు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)