అంధత్వం: మేనరికాలు, దగ్గరి సంబంధాలు.. పుట్టబోయే పిల్లలకు శాపం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అంధత్వం: మేనరికాలు, దగ్గరి సంబంధాలు.. పుట్టబోయే పిల్లలకు శాపం

  • 29 జూన్ 2018

హైద‌రాబాద్‌లోని దేవ‌నార్ అంధుల పాఠ‌శాల‌. ఇక్క‌డ ఉన్న అంధ బాల‌బాలికల్లో మూడొంతుల మంది మేన‌రికాలు, దగ్గరి సంబంధాల వ‌ల్ల పుట్టిన‌వారే!

మేన‌రికం పెళ్లిళ్ల‌తో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చాలా మందికి తెలుసు కానీ.. అవి ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిపే ఉదాహ‌ర‌ణ ఇది!

దేవ‌నార్ ప్ర‌పంచంలోనే పెద్ద అంధుల పాఠ‌శాల అని చెబుతోంది యాజ‌మాన్యం. ఇక్క‌డ ఆంధ్ర‌, తెలంగాణ‌ల‌తో పాటు వివిధ రాష్ట్రాల‌ నుంచి వ‌చ్చిన పిల్ల‌లు ఎల్‌కేజీ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ చ‌దువుతుంటారు.

మొత్తం 463 మంది విద్యార్థుల్లో 313 మంది త‌ల్లిదండ్రులు ద‌గ్గ‌రి సంబంధాల్లో పెళ్లి చేసుకున్న‌వారే. అంటే ఈ విద్యార్థుల్లో 68 శాతం మంది మేన‌రికాలు లేదా దగ్గరి సంబంధాల వల్ల పుట్టిన వారే.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)