లబ్‌డబ్బు: వాట్సాప్‌ పే.. తప్పక తెలుసుకోవాల్సిన ఫీచర్ ఇది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

లబ్‌డబ్బు: వాట్సాప్‌ పే.. తప్పక తెలుసుకోవాల్సిన ఫీచర్ ఇది

  • 30 జూన్ 2018
paytm Image copyright Getty Images

ప్రపంచం పరిగెడుతోంది. మనం కూడా దానితో పాటే పరిగెడుతున్నాం. అయితే తల దించుకుని పరిగెడుతున్నాం. మెడలు వంచేసుకుని సెల్ ఫోన్ లోకే చూస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని మరచిపోయి.. ఇంకా వివరణ ఎందుకు లెండి.

ఎప్పుడైతే మొబైల్ లావాదేవీలు, మొబైల్ షాపింగ్ టెక్నాలజీ వచ్చాయో ఆ మొబైల్ ఫోన్‌లోకే ప్రపంచం వచ్చేసింది. ఇపుడు లేటెస్ట్‌గా వాట్సాప్ కూడా భారత్‌లో పేమెంట్ సర్వీస్ స్టార్ట్ చేయబోతోంది.

డిజిటల్ పేమెంట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ వాలెట్స్. Pay TM గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రతి నెలా దాదాపు ఆరు కోట్లకు పైగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జరుగుతాయని ఆ సంస్థ చెబుతోంది. ఇక ఫ్లిప్ కార్ట్‌కి చెందిన Phone Payలో నాలుగు కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఆ సంస్థ ప్రకటించింది. గూగుల్ కూడా తమ చెల్లింపుల యాప్ తేజ్‌కు ఒకటిన్నర కోట్ల యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని అంటోంది.

ఈ పేమెంట్ యాప్స్అన్నీ ఆర్బీఐ ప్రవేశపెట్టిన యూపీఐ మీద ఆపరేట్ అవుతున్నాయి. UPI అనేది రకరకాల బ్యాంకు అకౌంట్లను ఒక సింగల్ మొబైల్ అప్లికేషన్ పైకి తీసుకొచ్చి, బ్యాంకింగ్ ఫీచర్ లను ఒకేతాటి మీదకి తీసుకొచ్చి చెల్లింపులను సునాయాసం చేసింది. ఈ మధ్య ప్రతి బ్యాంకూ తమ తమ మొబైల్ పేమెంట్ యాప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఇపుడు వాట్సాప్ కూడా తన పేమెంట్ సర్వీస్‌ను ప్రారంభించబోతోంది.

ఇప్పటికే పది లక్షల మంది వినియోగదారులు

వాట్సాప్ కూడా పేమెంట్ సర్వీస్ స్టార్ట్ చేస్తే మెసేజ్ పంపించినంత సులభంగా డబ్బును ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అయితే వాట్సాప్ సర్వీస్‌కు కొన్ని పరిమితులు ఉండబోతున్నాయి. ఈ సర్వీస్ లో మిగతా బ్యాంకింగ్ యాప్ల లాగా అన్ని రకాల లావాదేవీలూ నిర్వహించలేము. ఇక్కడ పియర్ టు పియర్ లావాదేవీలను మాత్రమే నిర్వహించగలం. అయితే భవిష్యత్తులో ఇది సేవలను విస్తరించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

వాట్సాప్ వాడే వినియోగదారులు దేశంలో ఎంత భారీగా ఉన్నారో చెప్పక్కర్లేదు. దాదాపు ఇరవై కోట్ల మంది భారత్‌లో వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ పే అనే పైలట్ వెర్షన్ ఫిబ్రవరి లో పది లక్షల మంది తో స్టార్ట్ చేశారు. అలాగే వాట్సాప్ పే వీటా వర్షన్‌ను ఇంకా పరీక్షిస్తున్నారు.

అయితే ఈ వాట్సాప్ పే లో ఎటువంటి ఫీచర్స్ ఉండబోతున్నాయనే దాని మీద జనాలలో ఆసక్తి పెరుగుతోంది. సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతోందన్న వార్తలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి.

Image copyright Getty Images

ఎంత వరకు సురక్షితం?

డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ కూడా దుర్వినియోగం అయిపోతాయేమో అన్న భయాలున్నాయనడంలో డౌట్ లేదు. ఎందుకంటే వాట్సాప్ ఓనర్ ఐన ఫేస్‌బుక్ ఈ డేటాను కూడా దుర్వినియోగం చేస్తుందా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ చేస్తే ఆ వివరాలు ఎంత సేఫ్ అన్నది చాల మందిలో ఉదయిస్తోన్న ప్రశ్న.

ఈ ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు వాళ్ళవరకు వెళ్లినట్టున్నాయి. అందుకే ఈ సర్వీస్‌ను పూర్తిగా ప్రారంభించే ముందర తమ ప్రైవసీ పాలసీ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటోంది వాట్సాప్. ముఖ్యంగా చెల్లింపులకు సంబంధించిన గోప్యత విధానాన్ని ఇంకా కఠినం చేయటం, తమ సేవలకు సంబంధించిన నిబంధనలతో కూడా మార్పులు తెచ్చే అవకాశముంది. జాతీయ చెల్లింపుల సంస్థతో పాటు ఇతర బ్యాంకులు, భారత్ ప్రభుత్వంతో ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరిగాయి. అలాగే వాట్సాప్‌తో UPI, ఇతర బ్యాంకులు టై అప్ అవడానికి అనుమతి కూడా లభించింది.

Image copyright Getty Images

ఇక్కడ జరిగే మోసాలను ఎలా అరికడతారు?

పిన్, సీవీవీ, వివరాల భద్రతా ఎలా ఉంటుంది అన్నవి కీలక ప్రశ్నలు. ఈ అంశం పై దృష్టి సారించినట్టు వాట్సాప్ ఇప్పటికే ప్రకటించింది. అయినా మీరు వాట్సాప్ పే సర్వీస్ ను ఉపయోగించాలనుకుంటే మాత్రం నేను ఇప్పటిదాకా ఎన్నో సార్లు ఈ షో లో చెప్పినట్టు నిబంధనలు, షరతులు, బాగా చదివి అర్థం చేసుకుని ముందుకెళితే మంచిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)