కర్ణాటక పోలీస్: బరువు తగ్గకుంటే ఉద్యోగం ఊడుతుంది

  • 10 జూలై 2018
పోలీస్ Image copyright Getty Images

కర్ణాటకలో స్థూలకాయులైన పోలీసులు బరువు తగ్గకపోతే సస్పెన్షన్‌కు గురయ్యే పరిస్థితి వచ్చింది.

''గత 18 నెలల్లో రాష్ట్రానికి చెందిన 100 మంది పోలీసులు జీవనశైలి రుగ్మతల వల్ల చనిపోయారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేసీఆర్‌పీ) చీఫ్ భాస్కర్ రావు బీబీసీకి చెప్పారు.

స్థూలకాయంతో ఇబ్బందిపడుతున్న వారి సంఖ్య డిపార్ట్‌మెంట్లో పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకునేందుకు పోలీసులకు సాయం చేస్తామని ఆయన వివరించారు.

కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేసీఆర్‌పీ)‌లో మొత్తంగా 14 వేల మంది పోలీసులు ఉన్నారు. రాష్ట్రంలో నిర్వహించే భారీ కార్యక్రమాలకు భద్రత కల్పించేందుకు, శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు పరిస్థితిని అదుపు చేసేందుకు ఈ బలగాలను వినియోగిస్తుంటారు.

కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేసీఆర్‌పీ)‌లో స్థూలకాయులైన పోలీసులను సీనియర్ అధికారులు గుర్తిస్తారు. వారు బరువు తగ్గేలా శారీరక వ్యాయామాలు చేయిస్తారు.

''కేసీఆర్‌పీ పోలీసుల షుగర్ లెవల్స్‌ను, వారి ఆరోగ్యపరిస్థితిని 6 నెలలకు ఒకసారి పరిశీలిస్తున్నాం. ఇకపై ఎవరైనా ఆరోగ్యంపట్ల ఆశ్రద్ధగా ఉంటే వారిని సస్పెండ్ చేస్తాం. విధుల నుంచి తొలగిస్తాం'' అని భాస్కర్ రావు బీబీసీకి తెలిపారు.

భారత్‌లో పోలీసులు బరువు తగ్గడానికి కష్టపడుతుండటం అసాధారణమేమీ కాదు.

''గత 18 నెలల్లో 153 మంది సిబ్బంది చనిపోయారు. ఇందులో 24 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతే మరో 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన వారు జీవనశైలి రుగ్మతలు, షుగర్, గుండెపోటుతో చనిపోయారు. ఇదే మేం మేల్కోవడానికి సరైన సమయం అనిపించింది'' అని కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేసీఆర్‌పీ) చీఫ్ చెప్పారు.

''బియ్యం సంబంధిత ఆహారాన్నే ఇక్కడి పోలీసులు ఎక్కుగా తీసుకుంటుంటారు. పొగతాగడం, మద్యపానం చేసేవారున్నారు. వ్యాయామం చేయడం లేదు. అందుకే ప్రతి పోలీసు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) చెక్ చేయాలని మా పాటూన్ కమాండర్స్‌లను ఆదేశించాం'' అని ఆయన వెల్లడించారు.

స్థూలకాయులైన పోలీసులకు కేఎస్ఆర్‌పీ యోగా తరగతులు నిర్వహిస్తుంది. ఈత కొట్టడంలో శిక్షణ ఇస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 11 స్థానాల్లో గెలుపు, ఒక స్థానంలో ఆధిక్యం

‘#StopTeluguImposition’: తెలుగు భాషను తమపై రుద్దవద్దని తమిళులు ఎందుకు అంటున్నారు

'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - మాజీ ప్రధాని కుమార్తె

దిల్లీ అగ్నిప్రమాదం: ‘ముగ్గుర్ని కాపాడా.. కానీ, నా సోదరుడిని కాపాడుకోలేకపోయా’