గోదావరిలో పడవ ప్రమాదం: ఆరుగురు అమ్మాయిలు, ఒక మహిళ గల్లంతు

  • 15 జూలై 2018
ప్రమాదం జరిగిన ప్రదేశం Image copyright UGC
చిత్రం శీర్షిక పడవ ప్రమాదం జరిగిన ప్రదేశం

గోదావ‌రి న‌దిలో శనివారం (జులై 14) జరిగిన ప‌డ‌వ ప్ర‌మాదంలో ఆరుగురు అమ్మాయిలు, ఒక మ‌హిళ గ‌ల్లంత‌య్యార‌ని తూర్పుగోదావ‌రి క‌లెక్ట‌ర్ కార్తికేయ మిశ్రా బీబీసీతో చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా ఐ పోల‌వ‌రం ద‌గ్గ‌ర్లో స‌లాదివారిపాలెం - ప‌శువుల్లంక గ్రామాల మ‌ధ్య ఈ ప్ర‌మాదం జ‌రిగింది. న‌దిలో వెళ్తున్న ప‌డ‌వ అక్క‌డ నిర్మిస్తున్న వంతెన స్తంభానికి (పిల్ల‌ర్) త‌గల‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ప్ర‌వాహం ఎక్కువ ఉండ‌డం, చీక‌టి కావ‌డంతో న‌దిలో గాలింపు చ‌ర్య‌లు నిలిచిపోయాయి. మళ్లీ ఈ ఉదయం 5 గంటల నుంచి 9 బోట్ల సాయంతో గాలింపు ప్రారంభమైంది. నదికి ఇరువైపులా గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.

ప్ర‌యాణికుల్లో ఎక్కువ మంది హైస్కూలు విద్యార్థులున్న‌ట్టు స్థానికులు చెబుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర‌, జాతీయ విపత్తు నివార‌ణ సంస్థ‌ల నుంచి 70 మందితో కూడిన‌ బ‌ృందాలు ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చాయి. సంఘ‌ట‌న స్థ‌లానికి జిల్లా అధికారులు, నాయ‌కులు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. గోదావ‌రి మొద‌టి పాయ వృద్ధ గౌత‌మిలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

తూర్పుగోదావ‌రి క‌లెక్ట‌ర్ కార్తికేయ మిశ్రా క‌థ‌నం ప్ర‌కారం.. ప‌డ‌వ పిల్ల‌ర్‌కు తగ‌ల‌డంతో కొంద‌రు విద్యార్థులు ప‌డ‌వలో నుంచి పిల్ల‌ర్ ఫౌండేష‌న్ మీద‌కు దూకారు. దీంతో ప‌డ‌వ ఒక వైపు ఒరిగి, బ్యాలెన్స్ కోల్పోయి కొంద‌రు నీటిలో ప‌డిపోయారు. వారిలో కొంద‌రు ఈదుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప‌డ‌వ‌కు ఏం కాలేదు. ప‌డ‌వ మున‌గ లేదు. ప్ర‌మాదం జ‌రిగే స‌మ‌యానికి ప‌డ‌వ‌లో ఎంత మంది ఉన్నార‌న్న‌ది స్ప‌ష్టంగా తెలియలేదు. కొంద‌రు ఇళ్ల‌కు వెళ్లిపోవడంతో సంఖ్య స‌రిగా తెలియ‌లేదు. సుమారు 30 మంది ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

గ‌ల్లంత‌యిన ఆరుగురు అమ్మాయిలు కె. రమ్య (13), పి. వీర మనీషా (15), ఎస్. శ్రీజ (15), టి. ప్రియ భైరవమూర్తి (13), పి. అనూష (14), పి. సుచిత్ర (12)లుగా గుర్తించారు. మరో మహిళ జి. నాగమణి (35) ఆచూకీ కూడా ఇంకా లభ్యం కాలేదని క‌లెక్ట‌ర్ చెప్పారు. "గ్రామాల్లోకి మా బృందాల‌ను పంపి న‌ది ఒడ్డుకు ఎవరైనా చేరుకున్నారా? ఎవ‌రెవ‌రు ఇళ్ల‌కు చేరుకోలేదు? అన్న స‌మాచారం సేక‌రిస్తున్నాం. అన్ని చోట్ల‌కూ బృందాల‌ను పంపాం’’ అని తెలిపారు.

Image copyright UGC
చిత్రం శీర్షిక వంతెన పిల్లర్ వద్ద ఉన్న ప్రజల్ని పడవలోకి ఎక్కిస్తున్న స్థానికులు
Image copyright UGC
చిత్రం శీర్షిక పిల్లర్ వద్ద ఉన్న ప్రజల్ని పడవలో ఎక్కించుకుని గట్టుపైకి తీసుకొస్తున్న స్థానికులు
Image copyright UGC
Image copyright UGC

"నదిలో ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఒక‌వేళ గ‌ల్లంత‌యిన వారు రాత్రికి ఈదుకుంటూ ఏదైనా తీరానికి చేరుకుంటే సంతోషం. వారు ఈ ప్ర‌వాహంలో ఎంత‌వ‌ర‌కూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటార‌నేది చెప్ప‌లేం" అని ఆయ‌న అన్నారు.

"ఈ ప్రాంతంలో ఉన్న అవ‌స‌రాన్ని బ‌ట్టి, రూ. 35 కోట్ల‌తో వంతెన నిర్మిస్తున్నాం. కానీ అదే వంతెన స్తంభానికి తాకి ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం" అని క‌లెక్ట‌ర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌‌'పై విచారణ కమిషన్: నిందితులు పిస్టల్ లాక్కొని దాడికి దిగినా పోలీసులు గాయపడలేదా: సీజేఐ

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్

రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?

యువకుడిపై నలుగురి అత్యాచారం... ముంబైలో మూడు గంటల పాటు నరకం

పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత