#లబ్‌డబ్బు: పీఎఫ్ నిబంధనల్లో మార్పులతో ప్రయోజనాలివే

కాలేజీలో చదివే రోజుల్లో కెరీర్లో ఇది చేయాలి, అది చేయాలి, కెరీర్‌తో ఇలా ప్రయోగాలు చేయాలి, అలా ఆ బిజినెస్ చేయాలి, పెద్ద వ్యాపారి అయిపోవాలి... అంటూ ఎన్నో ఆలోచనలు చేస్తాం.
కానీ, కెరీర్ డిసైడ్ చేయాలి అనే రోజు వచ్చేసరికి... ఎందుకొచ్చిన గొడవరా బాబు.. జాబ్ సెక్యూరిటీ ఉంటే చాలు అంటూ ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోతాం.
దాదాపు 90% మంది పరిస్థితి ఇదే. దానికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. చాలా మంది అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయన్న ఆలోచన చేస్తారు. అందులో ముఖ్యమైనది పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్).
పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన ఆదాయంలో నుంచి కొంత మొత్తం మన భవిష్యత్తు కోసం దాచుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.
దీనికి సంబంధించిన నియమ నిబంధనల్లో ఇటీవల కొన్ని మార్పులు వచ్చాయి. అయితే ఈ మార్పులు మీకు ఎలా వర్తిస్తాయి? మీరు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది ఈ వారం 'లబ్‌డబ్బు'లో చూడండి.

మన భవిష్యత్తు కోసం నిధులను సమకూర్చే ఈపీఎఫ్‌కు సంబంధించిన మార్పులలో ఒక శుభవార్త ఉంది. ఎవరికైనా ఉద్యోగం పోయినా కూడా మీ ఈపీఎఫ్ అకౌంట్ ఆక్టివ్‌గానే ఉంటుంది. పైగా అప్పటిదాకా మీరు దాచిన ఈపీఎఫ్ మొత్తంలో నుంచి 75% డబ్బు మొదటి నెలలోనే విత్‌డ్రా చేసుకోవచ్చు.
రెండు నెలల తరువాత మిగతా 25% డబ్బు తీసుకోవచ్చు. ఇది వరకు ఉద్యోగం పోయిన రెండు నెలలకు కానీ డబ్బు తీసుకునే అవకాశం ఉండేది కాదు.
ఇక మీ జీతంలో 12% ఈపీఎఫ్‌లో జమ అయిపోతుంది అనేది మనకు తెలుసు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ 12% లో 3.67% మాత్రమే ఈపీఎఫ్‌లోకి జమవుతుంది. మిగతా 8.33% ఎంప్లాయ్ పెన్షన్ యోజనలోకి వెళుతుంది.
మొత్తం 12% లో 8.33% పీఎఫ్ పెన్షన్ అకౌంట్లోకి చేరుతుంది. ఇక ఈ పెన్షన్‌కు సంబంధించి మీరు మీ ఉద్యోగంలో 10 ఏళ్లు పూర్తి చేయడం తప్పనిసరి. మీ వయసు 58 ఏళ్ళు దాటిన తరువాత మీకు పెన్షన్ లభిస్తుంది. కనిష్టంగా పెన్షన్ రూ.1000లు అయితే గరిష్టంగా పెన్షన్ రూ.3,250లు. రాబోయే రోజుల్లో ఇది మారొచ్చు.
కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పీఎఫ్‌లోని మీ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, అప్పుడు కూడా మీరు మొత్తం డబ్బు విత్ డ్రా చేయలేరు.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: కత్తి మహేశ్ - పరిపూర్ణానంద బహిష్కరణలు దేనికి సంకేతం?
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- హాలీవుడ్ సినిమాల రేంజ్లో జైళ్ల నుంచి తప్పించుకున్నారు వీళ్లంతా
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)