#గమ్యం: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ కావడం ఎలా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#గమ్యం: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ కావడం ఎలా?

  • 15 జూలై 2018

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

మూడు వారాలుగా విమానయాన రంగంలో ఉద్యోగావకాశాల గురించి గమ్యంలో చర్చిస్తున్నాం. ఆ సిరీస్‌లో భాగంగా... ఈ వారం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ (ఏఎంఈ) ఉద్యోగాల గురించి వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ అనే ఉద్యోగాల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే చాలామంది గ్రామీణ విద్యార్థులకు ఏవియేషన్ అంటే ఓ సుదూర స్వప్నం. ఎవరైనా కొద్దిమందికి పైలట్లు, ఎయిర్ హోస్టెస్ వంటి వాటిపై కొంత అవగాహన ఉంటే ఉండొచ్చు. కానీ ఏఎంఈల గురించి ఎక్కువ మందికి తెలియదు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లకు ఇప్పుడే కాదు... రాబోయే సంవత్సరాల్లో కూడా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి.

ఒక్క ఎయిర్‌క్రాఫ్ట్ గాలిలోకి ఎగరాలంటే దానికి సుమారు 33 మంది ఇంజినీర్లు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్లనే ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అంటారు. ఈ ఉద్యోగంలో చేరాలంటే ఏ కోర్సు పూర్తి చేయాలి, ఆ కోర్సుకు కావాల్సిన అర్హతలేమిటి, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి.. ఈ వివరాలన్నీ ఈ వారం 'గమ్యం'లో.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)