గుజరాతీలో బీబీసీ బులెటిన్ : నేటి నుంచి రాత్రి 8 గంటలకు

  • 16 జూలై 2018
బీబీసీ గుజరాతీ న్యూస్

ఈ రోజు నుంచి బీబీసీ గుజరాతీ సర్వీస్ టీవీ న్యూస్ బులెటిన్ ప్రసారం కాబోతోంది. జీఎస్‌టీవీ(గుజరాత్ సమాచార్ టెలివిజన్)లో ఇది సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రసారమవుతుంది.

గుజరాతీలకు సాయంత్రాలంటే ఇష్టం. ఆ సమయంలో తమకు ఫేవరెట్ మద్యంతో విందులో మునిగితేలే బయటివారికి ఇది కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ మద్యనిషేధం ఉన్న రాష్ట్రంలో ఉన్న గుజరాతీలు సాయంత్రాలను తమదైన శైలిలో ఆస్వాదిస్తారు.

'ఫర్సాణ్' అనే రుచికరమైన పలహారం, కప్పులో పొగలు కక్కే 'కటింగ్ చాయ్‌'తో సాగే సంభాషణలు గుజరాతీ సాయంత్రాలకు మరో రూపంగా నిలుస్తాయి.

అలాగే కోల్‌కతాలో వారికి ఉన్నట్టు మన్నాడే కూర్చిన 'కాఫీ హౌసర్ అడ్డాటా' మాకు లేదు. కానీ 'చాయ్ పే చర్చా' రుచి ఎలా ఉంటుందో మాకు తెలుసు అంటారు గుజరాతీలు.

అయినా కొత్త రుచులు, కొత్త కథలతో బాగా ఉడికే మా చర్చ మరింత 'కడక్' అవుతుంది. మా సంభాషణల్లో చాలా పదాలు దొర్లుతాయి, ఉద్రేకం కలిగించే ఉపన్యాసాలు, కట్టిపడేసే కథలుంటాయి. తరచూ కొత్త కోణాలు కనిపిస్తాయి.

గుజరాతీల అభిరుచులకు అద్దం పట్టేలా బీబీసీ న్యూస్ గుజరాతీ ఈ రోజు తన తొలి టీవీ బులెటిన్ ప్రారంభిస్తోంది. 30 నిమిషాల 'బీబీసీ సమాచార్' సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రాత్రి 8 గంటలకు జీఎస్‌టీవీలో ప్రసారం అవుతుంది.

ఇది భిన్నమైన భూమి

ఒక వైపు సముద్రం, మరోవైపు ఎడారి ఉన్న గుజరాత్ భూమి భిన్నంగా ఉంటుంది.

అహ్మదాబాద్‌లోని అద్భుతమైన హిందూ-ముస్లిం-జైన్ ఆర్కిటెక్చర్ ఈ నగరానికి ప్రపంచ సాంస్కృతిక నగరం అనే పేరు తెచ్చిపెట్టింది.

దేశంలో విజయవంతమైన మహిళా సహకార సంఘాలున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిన గుజరాత్.. కొన్ని గ్రామాలలో వెయ్యి మంది పురుషులకు 400 మంది కంటే తక్కువ మహిళలు ఉండడంతో దేశంలోనే లింగ నిష్పత్తి అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రం అయ్యింది.

ఈ వైరుధ్యాలను, భిన్నవాదనలను బీబీసీ గుజరాత్ వెబ్‌సైట్, బులెటిన్ సర్వీసులు అన్వేషిస్తాయి. అర్థం చేసుకుంటాయి. ఉన్నతమైన రిపోర్టింగ్‌తో, బాధ్యతాయుతమైన జర్నలిజం ద్వారా వాటిని మీ ముందు ఆవిష్కరిస్తాయి.

ఎవరూ చెప్పని కథలు, ఆకట్టుకునే వ్యాఖ్యానం, సంఘాలు-జాతుల విభజన, లింగ అసమానతలు, సైద్ధాంతిక ఆంక్షలు, రాజకీయ అస్థిరత, నైతిక ఆదేశాల అమలు ఇలా.. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆకట్టుకునే అంశాలను బీబీసీ గుజరాతీ నిరంతరం మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది.

చిత్రం శీర్షిక లక్ష్మీవిలాస్ ప్యాలెస్, వడోదర

ప్రపంచాన్ని చూసే మీ కిటికీ

మా కొత్త ఫ్లాట్‌ఫాం బీబీసీ గుజరాతీ బులెటిన్ పారదర్శక, నిష్పాక్షిక, సమర్థవంతమైన ఒక కొత్త యుగాన్ని మీకు పరిచయం చేస్తుంది.

బీబీసీ సమాచార్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీబీసీ రూపొందించిన అంశాలలో అత్యుత్తమమైన వాటిని ఏర్చికూర్చి మీ ముందుకు తీసుకొస్తుంది.

ఈ బులెటిన్లో అంతర్జాతీయ అంశాలతోపాటూ భారతదేశ కథనాలూ ఉంటాయి. ట్రెండింగ్ టాపిక్స్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్, హెల్త్, ఎడ్యుకేషన్, విమెన్ ఇంట్రెస్ట్ అన్నీ మేం కలగలిపి అందిస్తాం

చిత్రం శీర్షిక మోహన్ దాస్ గాంధీ విద్యాలయ్, రాజ్‌కోట్

గత ఏడాది ప్రారంభమైన ప్రయాణం

2017 అక్టోబర్ 2న తెలుగు, మరాఠీ, పంజాబీ వెబ్‌సైట్లు, బీబీసీ తెలుగు న్యూస్ బులెటిన్‌తోపాటు మా బీబీసీ న్యూస్ గుజరాతీ వెబ్‌సైట్ ప్రారంభమైంది. భారతదేశంలో బీబీసీ ఇప్పటికే హిందీ, తమిళ్, తెలుగు, బంగ్లా, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఉంది.

కొత్త భాషల చేరికతో బీబీసీ ఇండియా ఇప్పుడు 9 భాషల్లో సేవలు అందిస్తోంది.

ఎక్కువ మంది గుజరాతీలు బీబీసీని ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన మీడియా సంస్థగా భావిస్తున్నారు.

ఏడాది కిందటి వరకూ గుజరాతీలకు బీబీసీ హిందీ రేడియో లేదా ఇంగ్లిష్ టీవీ న్యూస్ మాత్రమే అందుబాటులో ఉంది. విశ్వసనీయ వార్తల గురించి తెలుసుకోవాలనుకునే గుజరాతీలు వీటివైపే వెళ్లేవారు. బీబీసీ గుజరాతీ ప్రారంభంతో మేం ఈ వారసత్వాన్ని గుజరాతీలకు వారి సొంత భాషలోనే అందించబోతున్నాం.

గుజరాత్ నేల మనకు ఎందరో ప్రముఖ జర్నలిస్టులను, జ్ఞానులను అందించింది. గుజరాత్ నేలపై పది నెలల ప్రయాణంలోనే యవతలో బీబీసీ గుజరాత్ తమదైన ప్రత్యేకతను చాటుకుంది.

చిత్రం శీర్షిక కచ్ ప్రాంతంలో మహిళ

8 కాగానే ఏమవుతుంది

గడియారం ముళ్లు 8 దగ్గరకు చేరగానే.. ఈ రాష్ట్రంలోని ఒక్కో నగరంలో ఒక్కో దృశ్యం ఆవిష్కృతం అమవుతుంది.

రాజధాని గాంధీనగర్‌ తన పగటి పరుగును తగ్గించుకుంటే, వజ్రాల నగరం సూరత్ మరింత మెరుస్తుంది. ఆనంద్ పాల సహకార సంస్థలో పనిచేసే మహిళలు పని నుంచి వచ్చి అప్పుడే రాత్రి వంట చేస్తుంటారు, వడోదర, రాజ్‌కోట్ వైట్ కాలర్ ఉద్యోగులు భోజనం చేసేందుకు ఇంటికి చేరుకుంటారు. ఇక అహ్మదాబాద్ నగరం నడిబొడ్డున మనేక్ చౌక్ ఆహార ప్రియుల కోసం కిటకిటలాడే నైట్ మార్కెట్ అయిపోతుంది.

గుజరాత్ ఎప్పుడూ బిజీబిజీగా, ఉత్సాహంగా, అలసటగా ఉంటుంది. ఇప్పుడు గడియారం 8 గంటలు కొట్టగానే, బీబీసీ సమాచార్ కోసం జీఎస్‌టీవీ ట్యూన్ చేయగానే అది అందరికీ సమాచారం, ఆసక్తి, స్ఫూర్తి, సంతోషం ఇంకా ఎన్నో అందిస్తుందనే మా ఆశ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

విషపూరిత కప్పలు... వాటిని నేర్పుగా తినే ఎలుకలు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి