#గమ్యం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో ప్రయోజనాలేంటి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#గమ్యం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో ప్రయోజనాలేంటి?

  • 22 జూలై 2018

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

జులై 7న కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ఓ ముఖ్యమైన ప్రకటన వచ్చింది. జేఈఈ, నీట్, నెట్, సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులకు, అభ్యర్థులకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రకటన ఇది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. గత నవంబర్‌లో దీనికి ఆమోదం లభించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రకటన జారీ అయింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే... ఉన్నత స్థాయి ప్రవేశ లేదా పోటీ పరీక్షలన్నింటినీ ఓ ఉమ్మడి ఏజెన్సీ ద్వారా, వివాదరహితంగా నిర్వహించాలి. దీనికోసం ఎన్టీఏను ఏర్పాటు చేశారు.

దీంతో ఇక నుంచి జేఈఈ మెయిన్స్, నీట్ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనున్నారు. అయితే దీనివల్ల ప్రయోజనాలేంటి, రెండుసార్లు ఎప్పుడు నిర్వహిస్తారు వంటి విషయాలన్నీ ఈ వారం 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com ఇంజనీరింగ్ ఎడిటర్ ప్రభ ధవళ. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు