GST: శానిటరీ న్యాప్‌కిన్లపై ఎత్తివేత.. వాషింగ్ మెషీన్లపై తగ్గింపు

  • 21 జూలై 2018
పియూశ్ గోయల్ Image copyright Getty Images

ఎట్టకేలకు శానిటరీ న్యాప్‌కిన్లపై జీఎస్టీ ఎత్తివేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. జీఎస్టీ నుంచి వీటిని తొలగించాలని ఏడాది కాలంగా డిమాండ్లు వస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటి దాకా శానిటరీ న్యాప్‌కిన్లపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీన్ని ఇప్పుడు పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అలాగే, రాఖీలపై కూడా జీఎస్టీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే, మరికొన్ని వస్తువుల జీఎస్టీని కూడా తగ్గించినట్లు చెప్పారు. అవి ఏంటంటే..

జీఎస్టీ పూర్తిగా ఎత్తివేసినవి..

  • శానిటరీ న్యాప్‌కిన్లు
  • రాఖీలు (విలువైన రాళ్లతో తయారు చేయనవి)
  • డబ్బా పాలు
  • పాలరాతి శిల్పాలు
  • రాళ్లతో చేసిన విగ్రహాలు
  • కలపతో చేసిన శిల్పాలు
Image copyright iStock
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

12 నుంచి 5 శాతానికి తగ్గించినవి..

  • అయిల్ కంపెనీలకు సరఫరా చేసే ఇథనాల్
  • రూ.1000 వరకు ఉండే పాదరక్షకాలు

18 నుంచి 12 శాతానికి తగ్గించినవి..

  • హస్తకళా వస్తువులు
  • హ్యాండ్ బ్యాగులు
  • వెదురుతో చేసిన ప్లోరింగ్
  • జ్యువెలరీ బాక్సులు
  • అద్దాలు
  • హ్యాండ్ మేడ్ ల్యాంప్స్

28 నుంచి 18 శాతానికి తగ్గించినవి..

  • వీడియో గేమ్స్
  • ఐరన్ బాక్సులు
  • సెంట్లు
  • టాయిలెట్ స్ప్రే
  • పెయింట్స్
  • వార్నిష్
  • స్పెషల్ పర్పస్ వెహికిల్స్
  • వర్క్ ట్రక్కులు
  • ఫ్రిజ్‌లు
  • వాషింగ్ మెషిన్లు
  • వాక్యూమ్ క్లీనర్లు
  • స్టోరేజ్ వాటర్ హీటర్లు
  • మిక్సీ, గ్రైండర్లు
  • టీవీలు (27 అంగుళాల లోపు ఉన్నవి)

తగ్గించిన పన్ను ధరలు జులై 27 నుంచి అమలులోకి వస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తిరిగి ఆగస్టు 5న సమావేశం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు