ప్రెస్‌రివ్యూ: రూ.60,845 కోట్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఆదాయపు పన్ను లక్ష్యం

  • 24 జూలై 2018
Image copyright Getty Images

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లు దాదాపు 25 శాతం పెరిగాయంటూ.. ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లు రూ.49,775 కోట్లకు చేరాయని తెలుగు రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎన్.పి.చౌధురి తెలిపారు. మొత్తం పన్ను వసూళ్లలో రూ.25,530 కోట్లు వ్యక్తులు చెల్లించగా.. రూ.24,245 కోట్లు కార్పొరేట్‌ పన్ను వసూళ్లు ఉన్నాయి.

వ్యక్తిగతంగా ఐటీ రంగంలో పని చేస్తున్న ఒక మహిళ దాదాపు రూ.30 కోట్ల వేతనాన్ని పొందిందని, దీనిపై 30 శాతం పన్ను వసూలు చేశామని చౌధురి చెప్పారు. హైదరాబాద్‌లో పనిచేసే ఆమె వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు.

2017-18కి రిటర్న్‌లు దాఖలు చేసిన వ్యక్తులు 30.93 లక్షల మంది ఉండగా.. కంపెనీలు 21,497కు చేరాయి. రెండు రాష్ట్రాల్లో కోటి మందికి పాన్‌ కార్డులు ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు రాష్ట్రాల్లో రూ.60,845 కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చౌధురి చెప్పారని ఈనాడు తెలిపింది.

Image copyright Getty Images

ఇక బలవంతపు భూసేకరణే!

'ఇక బలవంతపు భూసేకరణే' అంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే 2013 కేంద్ర భూసేకరణ చట్టం స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ సవరణ చట్టం - 2018కి సంబంధించిన విధి విధానాలతో సోమవారం జీఓ జారీ చేసింది.

2013 కేంద్ర భూసేకరణ చట్టంలోని సామాజిక ప్రభావ అంచనా, ప్రజాభిప్రాయ సేకరణలను చట్టబండల్లా మార్చి తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం - 2018 ప్రకారం భూ యజమాని ఇక ప్రేక్షకుడిగా మిగిలిపోనున్నాడని సాక్షి తెలిపింది.

సవరించిన కొత్త చట్టం ప్రకారం భూసేకరణ అథారిటీ (కలెక్టరు) సంప్రదింపుల ద్వారా రైతులను ఒప్పించి భూములను సేకరించవచ్చు.

భూములు ఇవ్వడానికి అంగీకరిస్తూ ఒకసారి రైతులు సంతకాలు చేస్తే తర్వాత ఈ చట్టం ప్రకారం వారు కోర్టుకు వెళ్లడానికి కూడా వీలుండదు అంటూ సాక్షి పేర్కొంది.

ఈ చట్టం ఇప్పటినుంచి కాకుండా.. 2014 జనవరి-1 తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలంటూ ప్రభుత్వం జోఓలో పేర్కొందని సాక్షి కథనం వెల్లడించింది.

తెలంగాణకు రాహుల్

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది. ఆ కథనం ప్రకారం..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియగానే ఆయన రాష్ట్రానికి రానున్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని నిలిపేసిన ప్రజాచైతన్య బస్సు యాత్రను టీపీసీసీ ఆగస్టు మొదటి వారంలో తిరిగి చేపట్టనుంది.

అప్పుడు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో చేపట్టే బస్సు యాత్రల్లో ఏదో ఒక బహిరంగ సభలో రాహుల్‌ పాల్గొననున్నట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.

సికింద్రాబాద్‌ నుంచి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పోటీ చేయడానికి ఆసక్తి చూపడం, దానిపై అంజన్‌కుమార్‌ అసంతృప్తి తదితర అంశాలూ రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వీలైనంత తొందర్లోనే తాను రాష్ట్రంలో పర్యటిస్తానని ఏఐసీసీ కార్యదర్శులకు రాహుల్‌ తెలిపినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

దీపిక పడుకోణ్ Image copyright facebook/Deepika Padukone

దీపికా పదుకోనె మైనపు విగ్రహం

లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో దీపికా పదుకోనె మైనపు విగ్రహం కూడా కొలువుదీరనుందని ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఇప్పటికే ఆ మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి ప్రముఖ సినీతారల బొమ్మలు ఉన్నాయి.

వచ్చే ఏడాది లండన్‌లో, ఆతర్వాత దిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో దీపిక బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. తన కొలతలు ఇవ్వడానికి దీపిక లండన్ వెళ్లింది.

మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధుల్ని కలిశాను, నా మైనపు బొమ్మ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని దీపిక అన్నట్లు ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

వారణాసి నుంచి మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా.. బీజేపీ జాబితాలో కనిపించని అడ్వాణీ పేరు

టీఆర్ఎస్ అభ్యర్థులు: జితేందర్ రెడ్డి సహా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు దక్కని టికెట్లు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: ‘ఎవరి ఒత్తిడి లేని పారదర్శక దర్యాప్తు మాకు కావాలి’

న్యూజీలాండ్ కాల్పులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లో చర్చిని తగలబెట్టారా?

‘మా ఊరిలో పిల్లల్ని కనకూడదు, ఎవరైనా చనిపోతే పూడ్చకూడదు’

గంగా మైదానంలో ‘హిందుత్వ’ పరిస్థితి ఏమిటి

న్యూజీలాండ్ ప్రధాని: ‘అలాంటి వారికి ఆ అవకాశం ఇవ్వం. మాది సురక్షితమైన దేశం’

సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది