చిత్రమాలిక: పాక్ ఎన్నికల పోలింగ్, పోటీలో పెద్దసంఖ్యలో మహిళలు
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముందెన్నడూ లేనంత పెద్దసంఖ్యలో మహిళలు ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. 272 పార్లమెంటరీ సీట్లకు 171 మంది మహిళలు బరిలో నిలిచారు. మరోవైపు క్వెట్టాలో జరిగిన బాంబు పేలుడులో కనీసం 31 మంది మరణించారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి, పోలింగ్ అనంతరం బ్యాలెట్ల భద్రత కోసం 3,70,000 మంది భద్రత సిబ్బందిని రంగంలోకి దించారు. నేటి పోలింగ్ విశేషాలు చిత్రాల్లో...

1. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువతులు
2. లోయర్ దిర్ జిల్లాలోని కొటో ప్రాంతంలోని మహిళా పోలింగ్ కేంద్రం
3. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న 19 ఏళ్ల తంజీర్ ఉర్ రెహ్మాన్... ప్రజాస్వామ్యం కావాలని చెబుతున్నారు.
4. ఎన్ఏ-29 ప్రాంతంలోని హజీ బండాలో తొలిసారి మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంతకాలం సంప్రదాయం పేరుతో స్థానికులు మహిళలకు ఓటు హక్కును నిషేధించారు. తన భర్త అనుమతితో ఓటు వేసినట్లు తొలి ఓటు వేసిన మహిళ చెప్పారు.
5. రావల్పిండిలోని బొహార్ బజార్లో పీటీఐ జెండాలతో బాలలు
6. ఎన్ఏ-6 ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో బిడ్డతో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ ఏజెంట్
7. లాహోర్‌లోని మోజంగ్ పోలింగ్ కేంద్రంలో సైన్యం వేసిన ఇనుప కంచె. ఇక్కడ పాత్రికేయులకు ప్రవేశాన్ని నిషేధించినట్లు హవాల్దార్ రజీక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
పాకిస్తాన్ ఎన్నికలు.. మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యాంశాలు
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై నిషేధం, ముందెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో మహిళలు పోటీచేయడం సహా పాక్ ఎన్నికలకు సంబంధించిన ఐదు ముఖ్యాంశాలు ఇవీ...