వీడియో: కరుణానిధి జీవితంలో అరుదైన ఘట్టాలు..
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: కరుణానిధి జీవితంలో అరుదైన ఘట్టాలు..

  • 7 ఆగస్టు 2018

కరుణానిధి జీవితంలో కొన్ని అరుదైన ఘట్టాలు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 1924, జూన్ 3న తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో జన్మించారు. 1957 నుంచి ఇప్పటిదాకా 13 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, అన్నిసార్లూ గెలిచారు.

1960లలో తమిళనాడులో జరిగిన 'హిందీ భాషా వ్యతిరేక' కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1969లో మొదటిసారిగా కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. 6 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.

తన రాజకీయ ప్రస్థానంలో కరుణానిధి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

మనుషులు లాగే రిక్షాలను రద్దు చేయడం, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ క్యాస్ట్‌ల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయడం, పెద్దల ఆస్తిలో మహిళలకు హక్కు కల్పించడం.. లాంటివి కొన్ని ఉదాహరణలు.

కలైంజర్ టీవీ సౌజన్యంతో..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)